Latest Updates
-
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే!
Maha Shivratri 2023: మహా శివుడికి ఇష్టమైన రాశులు, వారిపై ఎప్పుడూ ఆది దేవుడి ఆశీర్వాదాలుంటాయి
జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులను ఆ శివయ్య ప్రత్యేకంగా ఇష్టపడతాడని చెబుతారు. ఆ రాశుల వారిపై పరమేశ్వరుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం. ఆయా రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం శివునికి అకింతమైనదిగా భావిస్తారు. ఈ రోజున శివుడిని ఆరాధించడం ద్వారా, ఆయన ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. దీంతో పాటు ఆ రోజున శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శివుని అనుగ్రహం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఆ పరమ శివుడు తన భక్తుల్లో ప్రతి ఒక్కరి కష్టాలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులను ఆ శివయ్య ప్రత్యేకంగా ఇష్టపడతాడని చెబుతారు. ఆ రాశుల వారిపై పరమేశ్వరుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం. ఆయా రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశికి అధిపతి మంగళ దేవుడు. అంగారకుడిని శివునిలో భాగంగా భావిస్తారు. ఈ రాశి చక్రం యొక్క స్థానికులు పరమేశ్వరుడి అనుగ్రహంతో వారి జీవితంలో శివుని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు. మేష రాశి వారు సోమవారం నాడు శివుడిని విధిగా పూజించి, శివలింగానికి అభిషేకం చేస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

వృశ్చిక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశికి అంగారకుడు అధిపతి. దీనితో పాటు ఈ రాశి వారికి శివుని విశేష ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశి వారు ప్రతి సోమవారం శివలింగానికి నీటితో అభిషేకం చేసినట్లయితే పరమేశ్వరుడి కృపతో వారి కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఇది కాకుండా అన్ని రకాల భయాల నుండి వారు విముక్తి పొందుతారు.

మకర రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శివునికి ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి. ఈ రాశికి అధిపతి శని దేవుడు. శని పరమ శివుడికి ప్రియమైన భక్తుడు అని అంటారు. అందుకే మకర రాశి వారికి శివునికి విశేష ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశి వారు సోమవారం నాడు శివలింగానికి బేలపత్రం, గంగాజలం, ఆవు పాలు నైవేద్యంగా పెడితే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. దీంతో పాటు అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారని విశ్వాసం.

కుంభ రాశి:
కుంభ రాశికి అధిపతి శని దేవుడుగా పరిగణిస్తారు. ఈ రాశి వారికి శని దేవుని విశేష అనుగ్రహంతో పాటు పరమ శివుని అనుగ్రహం కుడూ ఉంటుంది. కుంభ రాశి వారు శివుడిని పూజిస్తే సులువుగా ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు. కుంభ రాశి వారు శివలింగంపై నీటితో అభిషేకం చేయాలని అంటారు.



Click it and Unblock the Notifications
