Latest Updates
-
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి!
Mercury Retrogrades in Libra On 27 September 2021:తులరాశిలో బుధుడి తిరోగమనం.. 12 రాశిచక్రాలపై ఏ ప్రభావమంటే..
తులరాశిలో బుధుడి తిరోగమనం.. 12 రాశిచక్రాలపై ప్రభావం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. నవ గ్రహాలలో రారాజుగా భావించే బుధుడు 2021లో సెప్టెంబర్ 27వ తేదీన అంటే సోమవారం నాడు తులరాశిలో తిరోగమనం చెందనున్నాడు.

ఇప్పటివరకు ఇదే రాశిలో ఉన్న బుధుడు నేటి నుంచి తిరోగమనం చేయనున్నాడు. ఇలా అక్టోబర్ 2వ తేదీ వరకు ఇక్కడే ఉండి.. ఆ తర్వాత కన్య రాశిలోకి తిరోగమన ప్రయాణం చేయనున్నాడు. బుధుడిని తెలివితేటలు, మేధస్సు ఇంద్రియాల కారకమైన గ్రహంగా భావిస్తారు.

కాబట్టి బుధుడి తిరోగమన ప్రయాణం ద్వాదశ రాశుల వారిని కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి..
ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానం నుండి తిరోగమనం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు కెరీర్ పరంగా ఎంత కష్టపడితే అంత పురోగతి సాధిస్తారు. మరోవైపు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగించాలి. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు పాత రుణాలను తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు.

వృషభ రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఆరో పాదం నుండి తిరోగమనంలో కదలనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. మీ శత్రువులు కూడా మీపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ కాలంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఈ సమయంలో మీరు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండాలి.

మిధునరాశి..
ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీరు ప్రతి పనిని చాలా ఆలోచనాత్మకంగా చేస్తారు. రాజకీయ రంగంలో ఉండే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు ఈ సమయంలో పురోగతి ఉంటుంది. మీరు కమ్యూనికేషన్ రంగంలో నైపుణ్యం కలిగి ఉంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి బుధుడు నాలుగో స్థానం నుండి తిరోగమన ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉన్నారని అనిపించొచ్చు. ఇలాంటప్పుడు ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. మీ కెరీర్ పురోగతి కోసం ప్రణాళికలను రూపొందిస్తారు. మీ వ్యాపారన్ని విస్తరిస్తారు.

సింహ రాశి..
ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం నుండి తిరోగమనం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ముఖ్యమైన పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ కాలంలో మీ పాత స్నేహితులను కలిసే అవకాశాన్ని పొందొచ్చు. అలాగే వారితో ఏదైనా ట్రిప్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కన్య రాశి..
ఈ రాశి నుండి బుధుడు రెండో స్థానం నుండి తిరోగమనంలో కదలనున్నాడు. ఈ సమయంలో మీ కుటుంబం, కమ్యూనికేషన్ తదితర విషయాలపై ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో మీరు పని పట్ల చాలా ఉత్సాహం చూపుతారు. సకాలంలో మీ పనులన్నీ పూర్తి చేయగలరు. మీరు కెరీర్లో పురోగతిపై శ్రద్ధ వహిస్తారు. మీకు స్నేహితులు కూడా మద్దతు ఇస్తారు. ప్రభుత్వ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. కెరీర్లో ముందుకు సాగే ప్రక్రియలో మీరు మీ జీవిత భాగస్వామిపై తక్కువ శ్రద్ధ చూపుతారు.

తుల రాశి..
ఈ రాశిలోకి బుధుడు తిరోగమనం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో మతపరమైన యాత్రకు వెళ్లొచ్చు. ఈ కాలంలో మీ ఖర్చులను నియంత్రించండి మరియు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. లేకపోతే మీ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా మారతాయి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి బుధుడు 12వ స్థానం నుండి తిరోగమనంలో ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేందుకు సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఒకవేళ మీరు కచ్చితంగా ప్రారంభించాలనుకుంటే.. మీరు అనుభవం ఉన్న వారి సలహాను తీసుకోవాలి. మరోవైపు మీ ప్రేమ జీవితంలో మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి బుధుడు 11వ స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. మీ సోషల్ సర్కిల్ క్రమంగా పెరుగుతుంది. ఈ కారణంగా మీరు చాలా మంది వ్యక్తుల జీవితాల్లో ప్రభావం చూపుతారు. ఈ కాలంలో కెరీర్ పరంగా సీనియర్ వ్యక్తుల సలహాలు తీసుకోవడం కొనసాగించండి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మద్దతు వల్ల మీరు మంచి విజయం సాధిస్తారు.

మకర రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీరు లక్ష్యాల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. మీరు విజయం సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. కష్టపడటం ద్వారా మాత్రమే మీరు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలుగుతారు. ఉద్యోగులకు ఈ కాలంలో సానుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశి నుండి బుధుడు తొమ్మిదో స్థానం నుండి తిరోగమనం చేయనున్నాడు. మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే లేదా మీ కుటుంబంతో విదేశాలలో నివసించాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా రంగంలో బాగా రాణిస్తారు. ఉద్యోగులు అద్భుతంగా పని చేస్తారు. మీకు అనేక కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఎలాంటి అపార్థం ఉండకూడదని గుర్తుంచుకోండి.

మీన రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీ స్నేహితులకు ముఖ్యమైన విషయాలు చెప్పడం మానుకోండి. ఎందుకంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ తల్లి ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోండి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉండొచ్చు. ఈ కారణంగా చాలా తేడాలు పెరుగుతాయి. మీరు ఓపికగా పరిస్థితులను నిర్వహించడానికి ప్రయత్నించాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. నవ గ్రహాలలో రారాజుగా భావించే బుధుడు 2021లో సెప్టెంబర్ 27వ తేదీన అంటే సోమవారం నాడు తులరాశిలో తిరోగమనం చెందనున్నాడు.



Click it and Unblock the Notifications











