Latest Updates
-
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
Republic Day 2023: భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడానికి దేశవ్యాప్తంగా జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలు చేయబడింది. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదించబడింది. అందుకే నవంబర్ 26 ను రాజ్యాంగ దినోత్సవంగా, జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.

రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

1.
1946 డిసెంబర్ 11వ తేదీన రాజ్యాంగ పరిషత్ సమావేశం జరిగింది. దీనిలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. రాజేంద్ర ప్రసాద్ చివరు వరకు ఈ పదవిలో కొనసాగారు.
2.
రాజ్యాంగంపై సంతకం చేస్తున్న రోజును చాలా శుభప్రదంగా భావించారు. ఎందుకంటే ఆ రోజు బయట వర్షం కురిసింది.
3.
భారత రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా రాశారు. ఇటాలిక్ శైలిలో రాసిన రాజ్యాంగంలోని ప్రతి పేజీని శాంతినికేతన్ కళాకారులు అలంకరించారు.
4.
రాజ్యాంగసభ సభ్యుల మొదటి సెషన్ 1947 డిసెంబర్ 9న జరిగింది. ఈ సమయంలో రాజ్యాంగ పరిషత్‌లో 207 మంది సభ్యులు ఉన్నారు. ఆ సమయంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఛైర్మన్ గా ఉన్నారు.
5.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమావేశాలు 114 రోజుల పాటు కొనసాగాయి. రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టింది.
6.
రాజ్యాంగ నిర్మాణ పనులకు దాదాపు 64 లక్షల రూపాయలు వెచ్చించారు. మొత్తం 7635 సమాచారాన్ని రాజ్యాంగ నిర్మాణ పనుల్లో చర్చించారు.
7.
అసలు రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వరా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300(A) ప్రకారం చట్టపరమైన హక్కుగా ఉంచారు.
8.
రాజ్యాంగ ఆత్మగా పిలవబడే ప్రియాంబుల్(ఉపోద్ఘాతం) అమెరికన్ రాజ్యాంగం నుండి తీసుకున్నారు.
9.
1950 జనవరి 26న అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఆమోదించారు.
10.
సెక్యులర్ అనే పదాన్ని 42వ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
11.
భారత రాజ్యాంగం అసలు కాపీని చేతితో రాశారు. ఈ కాపీ పార్లమెంటు భవనంలోని లైబ్రరీలోని నైట్రోజన్ గ్యాస్ ఛాంబర్‌లో భద్రంగా ఉంచారు.



Click it and Unblock the Notifications
