Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఆ సమయంలో నిద్రలేస్తే కలిగే లాభాలేంటో తెలుసా?
బ్రహ్మ ముహూర్తమంలో నిద్రలేస్తే మంచిదని పెద్దలు చెప్పడం చాలా మంది వినే ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారు అదృష్టవంతులు అవుతారని చెబుతుంటారు. హిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావ
బ్రహ్మ ముహూర్తం అనే పదాన్ని చాలా మంది వినే ఉంటారు. ముఖ్యంగా చదువుకునే సమయంలో బ్రహ్మముహూర్తం గురించి చాలా మంది సూచిస్తుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున అని తెలుసు చాలా మందికి. కానీ కరెక్టు సమయం మాత్రం కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.

బ్రహ్మ ముహూర్తం సమయం ఏంటి?
బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజాము 3.30 గంటల నుండి 5.30 లేదా 6 గంటల వరకు ఉంటుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నుండి సూర్యోదయానికి ముందు ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు.

బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత ఏంటి?
బ్రహ్మ ముహూర్తమంలో నిద్రలేస్తే మంచిదని పెద్దలు చెప్పడం చాలా మంది వినే ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారు అదృష్టవంతులు అవుతారని చెబుతుంటారు. హిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది.
బ్రహ్మ ముహూర్తంలో ఋషులు, మహర్షులు నిద్రను త్యాగం చేస్తుంటారు. దీని వల్ల మంచి జరుగుతుందని, వారికి ధ్యానం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెబుతుంటారు.

ఆరోగ్యపరంగా కూడా బ్రహ్మముహూర్తం ఎంతో మంచిది:
తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిదని శాస్త్రీయంగా నిరూపితమైంది. బ్రహ్మ మహూర్తంలో నిద్ర లేవడం వల్ల శారీరక, మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయని నిపుణులు చెబుతుంటారు.
ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల రోజంతా హుషారుగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చేసే వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

బ్రహ్మ ముహూర్తానికి, ప్రకృతికి మధ్య సంబంధం:
బ్రహ్మ ముహూర్తానికి ప్రకృతికి మధ్య సంబంధం ఉంటుంది. ఈ సమయంలోనే పక్షులు, జంతువులు మేల్కొంటాయి. అప్పటి నుండే అవి తమ ఆహార వేట మొదలుపెడతాయి. తెలవారుతుండగా పక్షులు చేసే కిలకిల రావాలు మనోహరంగా ఉంటాయి. కోళ్లు ఈ సమయంలోనే కూస్తుంటాయి. తామర పువ్వుల్లాంటివి ఈ సమయంలోనే వికసిస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలని ప్రకృతి చెప్పకనే చెబుతోంది.

ఆయుర్వేదంలో బ్రహ్మ ముహూర్తానికి ప్రాధాన్యత:
బ్రహ్మ ముహూర్తంలో నడవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. బ్రహ్మ ముహూర్తంలో నడక వల్ల శరీరంలో సంజీవనీ శక్తి ప్రసరిస్తుందని అంటారు ఆయుర్వేద నిపుణులు. ఉదయం వేళ వాతావరణంలో ఎలాంటి కాలుష్యం ఉండదు. రణగొణ ధ్వనులు ఉండవు. ఈ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు వీచే గాలి స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే బ్రహ్మ ముహూర్తంలో ప్రసరించే గాలిని అమృత తుల్యంగా భావిస్తారు.

బ్రహ్మముహూర్తంలో చదివితే గుర్తుంటుంది:
విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే చదివినవన్నీ బాగా గుర్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. విద్యార్థులు తెల్లవారుజామునే నిద్ర లేచి చదువుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యం పరీక్షల వేళ తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా చదువుకుంటే చదువు ఒంటబడుతుందని పెద్దలు చెప్పడం తెలిసిందే.
నిద్ర నుండి లేచిన తర్వాత చేస్తున్న పనిపై దృష్టి కేంద్రీకరించే శక్తి పెరుగుతుంది. మెదడు కూడా యాక్టివ్‌గా పని చేస్తుంది. బయటి నుండి దృష్టి మరల్చే అంశాలు ఉండవు. అలా బ్రహ్మ ముహూర్తంలో కాసేపు చదివినా మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతారు పెద్దలు.



Click it and Unblock the Notifications