Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Sun Transit in Gemini on 15 June 2021: సూర్యుడు మిధునంలో ఎంట్రీ.. 12 రాశులపై ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలు
2021 జూన్ 15వ తేదీన సూర్యుడు మిధునంలోకి ప్రవేశించనున్నాడు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు జూన్ 15వ తేదీన, అంటే మంగళవారం నాడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. జూన్ 15వ తేదీ ఉదయం 5:49 గంటల సమయంలో వృషభరాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. సుమారు నెలరోజుల పాటు సంచారం అంటే జులై 16వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఇక్కడే సంచారం చేయనున్నాడు.అనంతరం కర్కాటక రాశిలోకి రవాణా చేయనున్నాడు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో మరియు పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. పిల్లల విద్య గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈ సమయంలో వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీ నైపుణ్యం వల్ల మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. క్రీడా రంగంలో ఉండే వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. మీ తండ్రితో మంచి బంధం పెరుగుతుంది.
పరిహారం : ప్రతిరోజూ సూర్య నమస్కారం చేస్తే ప్రయోజనం ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ప్రియమైన వారి కోసం మరియు కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ ఖర్చులు చేయొచ్చు. పని విషయంలో ఈ సమయం మంచిగా ఉంటుంది. వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు. కొన్ని ఒప్పందాలను కూడా చేసుకుంటారు. మరోవైపు ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
పరిహారం : ప్రతిరోజూ పరమేశ్వరుడిని పూజించాలి.

మిధున రాశి..
ఈ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. అయితే ప్రత్యర్థులు కూడా మీకు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో మంచిగా ఉంటుంది. కొత్త జంటలకు వైవాహిక జీవితంలో అద్భుతంగా ఉంటుంది.
పరిహారం : ‘రామ రక్ష స్తోత్రం' ప్రతిరోజూ పఠిస్తే మంచి ఫలితం దక్కుతుంది.
అలాగే బెల్లం, పిండి, దుస్తులను ఆదివారం దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు సూర్యుడి రవాణా సమయంలో ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. మీరు నిర్లక్ష్యంగా చాలా వరకు నష్టపోవాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులు పెద్ద పెట్టుబడులు పెట్టే విషయం గురించి అనుభవం ఉన్న వారితో సలహాలు తీసుకోవాలి. లేకపోతే మీరు నిరుత్సాహపడతారు. ఆరోగ్యంగా ఉండేందుకు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.
పరిహారం : ‘గౌరీ మాత'ను ఆరాధిస్తే పవిత్రమైన ఫలితాలు వస్తాయి.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి లాభాలను పొందొచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మంచి సంబంధం కొనసాగించడం మరియు కుటుంబంలోని పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించాలి. విద్యార్థులకు ఈ సమయంలో విజయాలు లభిస్తాయి. మరోవైపు ప్రేమ సంబంధిత విషయాలలో మీకు నిరాశగా ఉంటుంది. మీరు కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయొచ్చు.
పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి నీటిని అర్పించాలి. తాజాగా ఎర్రని రంగులో ఉండే పువ్వులతో ఆరాధించాలి.

కన్య రాశి..
ఈ రాశి వారికి పని విషయంలో మంచిగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని గొప్ప విజయాలు పొందొచ్చు. మీరు ఈ సమయంలో ఏదైనా ఒప్పందంపై సంతకం చేయాలనుకుంటే లేదా స్థలాన్ని మార్చాలని ప్రయత్నిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు సూర్యుడి రవాణా వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు తల్లిదండ్రుల ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది.
పరిహారం : ఆదివారం రోజున దేవాలయాల్లో లేదా పేదలకు బెల్లం దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడొచ్చు. మరోవైపు మీ వ్యక్తిగత జీవితంలో ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు తెలివైన నిర్ణయాలను తీసుకుంటారు.
పరిహారం : తులసి మొక్కకు శుభ్రమైన నీటిని పోసి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలొస్తాయి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో నిరాశ ఎదురవుతుంది. మీ వైవాహిక జీవితంలో మీ భాగస్వామితో మరియు ఆస్తికి సంబంధించిన గొడవలు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో మీరు అనవసరమైన విషయాలపై ఫోకస్ పెట్టొద్దు. మరోవైపు మీకు ప్రభుత్వం తరపున కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
పరిహారం : సూర్యుడి రవాణా సమయంలో మీరు రూబీ రత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల వ్యక్తిగత జీవితంలో తాత్కాలికంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో అనుకోని కారణాల వల్ల కొన్ని విభేదాలు రావొచ్చు. వ్యాపారులు ఈ సమయంలో భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మీకు ఎదుగుదల ఉంటుంది. మీ వ్యాపారం విస్తరించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : సూర్యునికి ఓ రాగి పాత్రలో కుంకుమ నీటిని అర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి.

మకర రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ సమయంలో మీరు శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీరు కోర్టు కేసుల వంటి వాటి నుండి బయటపడతారు. ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. మీరు వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ప్రేమ సంబంధిత విషయాలకు సూర్యుడి రవాణా వల్ల ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
పరిహారం : సూర్యుని అనుగ్రహం కోసం ఆదివారం రోజున బెల్లం, పిండిని దానం చేయాలి.

కుంభ రాశి..
సూర్యుడి రవాణా వల్ల ఈ రాశి వారిలో పిల్లల విద్యపై ప్రభావం పడుతుంది. విద్య గురించి ఒత్తిడి పెరిగి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో వ్యాపారులకు ప్రత్యర్థులతో పోటీ గణనీయంగా ఉంటుంది. అయితే మీ కార్యకలాపాలన్ని చాలా చురుకుగా సాగుతాయి. మరోవైపు మీరు ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
పరిహారం : ఆదివారం రోజున రాగి పాత్రలను దానం చేస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయి.

మీన రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ భావోద్వేగాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. అవివాహితులకు కొన్ని మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పరిహారం : ఆదివారం రోజున మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటే ప్రయోజనం ఉంటుంది.



Click it and Unblock the Notifications











