For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu : ఓ రాశి వారు అనుకోకుండా జర్నీ చేయాల్సి రావొచ్చు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, అశ్వీయుజ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -08 October 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Monthly Horoscope: అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...Monthly Horoscope: అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ పిల్లలు విద్యలో రాణిస్తారు. ఈరోజు మీరు సంపద, కీర్తి మరియు విజయాన్ని పొందుతారు. ఈరోజు చాలా విషయాల్లో ఆనందిస్తారు. ఈరోజు, ఈ సంతోషంలో మీరు మీ సన్నిహితులను కూడా చేర్చాలి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కలిసి ఉండటం ద్వారా మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఇదంతా మీ కష్టానికి ఫలితమే. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. విదేశీ యానం చేసే వారికి మంచిగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు. మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు భవిష్యత్తుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో సమతుల్యతను సాధించగలుగుతారు. ఈరోజు మీరు కొంత సహాయం చేయొచ్చు. మీ సహాయంతో ఒకరి కెరీర్ మెరుగవుతుంది. ఈరోజు మీరు చాలా విషయాల్లో సానుకూలంగా ఉంటారు. ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి ఉదయం 11:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు చంద్రుని కదలిక వల్ల ఈరోజు మానసిక స్థితిలో మార్పు రావొచ్చు. మీ కలలు నిజమయ్యేందుకు మరికొంత కాలం పట్టొచ్చు. మీరు మీ మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు వచ్చినా వాటికి దూరంగా ఉండాలి. అందుకు బదులుగా కష్టపడి పని చేయాలి. మీరు ప్రణాళికతో ముందుకు సాగాలి. మీరు సానుకూలత మరియు మంచి ప్రణాళికతో పని చేస్తే, మీకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా.. వాటిని అధిగమిస్తారు. ఈరోజు మీకు ఏ రంగంలోనూ అడ్డంకులు ఎదురుకావు. అయితే మీరు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. ప్రయివేట్ ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు అవనసరమైన వాదనలు చేయొద్దు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి సాయంత్రం 7 గంటల వరకు

అక్టోబర్ నెలలో 4 గ్రహాల తిరోగమనం.. ఈ రాశులకు ఆర్థిక రంగంపై ప్రభావం...!అక్టోబర్ నెలలో 4 గ్రహాల తిరోగమనం.. ఈ రాశులకు ఆర్థిక రంగంపై ప్రభావం...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు కుటుంబంతో మంచి సమయాన్ని గడపొచ్చు. ఈరోజు మీరు ఒక చిన్న పార్టీని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తులారాశిలో చంద్రుని ప్రభావంతో, మీరు కుటుంబంతో కలిసి చిన్న పర్యటనలకు కూడా వెళ్లొచ్చు. ఈరోజు మీరు మీ రోజులో ఎక్కువ భాగం మీ కుటుంబం మరియు సన్నిహితులతో గడుపుతారు. మీ బంధుమిత్రులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించొచ్చు. స్వర్ణకారులకు ఈరోజు నష్టం ఉండొచ్చు. హోటల్, ఇతర రంగాల్లోని వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. న్యాయవాదులకు కూడా నష్టం ఉండొచ్చు. వీటి నివారణకు మీరు విష్ణు సహస్రనామం చేయాలి. అలాగే బ్రాహ్మాణులకు తెల్లని వస్త్రాలను దానం చేస్తే శుభఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : వెండి

లక్కీ నంబర్ :

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారు ఈరోజు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు సమస్యలను విస్మరించడం పరిష్కారం కాదు. మీరు దానికి పరిష్కారం వెతకాలి. ఇబ్బందులను శాశ్వతంగా తొలగించడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. మీరు మీ సన్నిహితులతో సాయంత్రం సమయాన్ని గడపొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కొంత పెద్ద బాధ్యత మీద పడొచ్చు. షేర్ మార్కెట్ రంగంలో ఉండే వారికి లాభాలు రావొచ్చు. కళారంగంలో పని చేసే వారికి మంచిగా ఉంటుంది. ఈరోజు ప్రయాణం చేయడానికి సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మానసిక కల్లోలం ఉండొచ్చు. ఈరోజంతా మీకు కొద్దిగా భిన్నంగా అనిపించొచ్చు. ఈరోజు చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఇది మీ కోపాన్ని కూడా పెంచుతుంది. ఈ పరిస్థితిలో, మీరు రోజంతా సానుకూలంగా ఉండాలి. మరోవైపు ఈరోజు మీరు ఇష్టమైన పనులు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. డాక్టర్లకు, న్యాయవాదులకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటకు బదిలీలు రావొచ్చు. వ్యాపారులకు ఈరోజు లాభాలు వస్తాయి.

లక్కీ కలర్ : లైట్ బ్లూ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ఈ రాశుల వారు భావోద్వేగాలను బయటపెట్టరట... ఎందుకంటే.. ఈ రాశుల వారు భావోద్వేగాలను బయటపెట్టరట... ఎందుకంటే..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా లాభాలొస్తాయి. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్త వినిపించొచ్చు. మీరు విదేశీ యానం చేయాలనుకుంటే సానుకూలంగా ఉంటుంది. మీ బంధువులతో ఆనందంగా గడపొచ్చు. మరోవైపు ఈరోజు మీరు ఒక విషయం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో పనులన్నింటినీ జాగ్రత్తగా పూర్తి చేయాలి. మీకు ఇష్టమైన వ్యక్తులతో సాయంత్రం ఆనందంగా గడపండి. మానసిక ఒత్తిడిని నివారించడానికి మీరు యోగా మరియు ధ్యానం సహాయం తీసుకోవాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పెండింగ్ పనులను చేయడానికి పూర్తి చేసేందుకు ఇబ్బందులు రావొచ్చు. ఈరోజు మీకు కొన్ని పెద్ద సమస్యలు ఎదురుకావొచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యా, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన వారికి ప్రతికూలంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు నష్టం రావొచ్చు. ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన సహాయం రాకపోవచ్చు. మరోవైపు మీ ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఎవ్వరికీ రుణం ఇవ్వడం వంటి పనులను చేయొద్దు. అమ్మవారి ఆరాధన చేస్తే శుభఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. స్వర్ణకార వ్యాపారులకు ఊహించిన లాభాలొస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు దూర ప్రయాణం చేయాల్సి రావొచ్చు. భవిష్యత్తులో మీరు ఈ ప్రయాణం నుండి గొప్ప ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు లాభాలను కూడా తగ్గించొచ్చు. మీ కెరీర్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు మంచి రోజు అవుతుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు మీరు చాలా కాలం తర్వాత కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంతో బంధాన్ని పెంచడానికి మరియు సంబంధంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఏదైనా పోగొట్టుకున్న విలువైన వస్తువును తిరిగి పొందుతారు. కార్మికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ ప్రియమైన వారితో కలిసి సినిమా లేదా డిన్నర్ కోసం బయటకు వెళ్లండి. మీ కుటుంబానికి మీ జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పండి.

లక్కీ కలర్ : గ్రే

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి ఉదయం 11 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతమైన ప్రణాళికను రూపొందించుకుంటారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలలో పాల్గొంటే.. కచ్చితంగా విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు శుభ ఫలితాలొస్తాయి. ఆటో, ఎలక్ట్రానిక్ రంగంలోని వ్యాపారులకు లాభాలొస్తాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి ఎదుగుదల ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఈరోజు అనుకూలంగా ఉండదు. వ్యాపారులకు ఈరోజు నష్టం రావొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవ్దదు. ఈరోజు మీరు మీ భావోద్వేగాలను నియంత్రించగలుగుతారు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మీ సామర్థ్యంపై మీకు నమ్మకం ఉంటుంది. ప్రజలతో మాట్లాడే కళ మెరుగుపడుతుంది. ఈ రోజు మీకు అదృష్టవంతమైన రోజుగా భావిస్తున్నారు. మీరు ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మీరు ఈరోజు ప్రణాళికను ముందుగానే చేయాలి. ఎవ్వరికీ రుణం ఇవ్వడం వంటివి చేయొద్దు. ఈరోజు మీకు ప్రశాంతత ఉండదు.

లక్కీ కలర్ : గ్రే

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 8:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -08 October 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Thursday, October 7, 2021, 18:30 [IST]
Desktop Bottom Promotion