Today Rasi Phalalu :ఓ రాశి వారికి ఈరోజు భాగస్వామితో సాన్నిహిత్యం పెరగొచ్చు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -19 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కొంతకాలం పాటు వేచి ఉండాలి. మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. మరోవైపు ప్రైవేట్ కంపెనీలో పని చేసే ఉద్యోగులు చాలా ఓపికగా పని చేయాలి. ఈరోజు మీకు నిరాశగా ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు తక్కువగా ఉండొచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీ ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఈరోజు శ్రామిక ప్రజలకు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు విదేశీ కంపెనీలో ఉద్యోగం ఆలోచిస్తున్నట్లయితే, మీ ప్రణాళికను కొనసాగించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించొద్దు. మీకు ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు బాస్ మీతో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఈరోజు మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మీ ప్రియమైన వారి మనోభావాలను దెబ్బతీసే ఉత్సాహంతో పని చయకండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :29

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో బాస్ నుండి ప్రశంసలు లభిస్తాయి. ఇది మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. వ్యాపారులు ఈరోజు లాభాలను ఆర్జించే మంచి అవకాశాన్ని పొందొచ్చు. ప్రత్యేకించి మీరు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన పనులు చేస్తే, ఈరోజు మీరు మీ నిర్ణయాల వల్ల మంచి ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమవుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఎముకలకు సంబంధించిన కొన్నిసమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు తమ ప్రణాళికలలో కొన్ని మార్పులు చేయాలి. మీరు ఆశించిన ఫలితాన్ని పొందకపోతే, మీరు కొన్ని కొత్త ప్రణాళికలపై పని చేయాలి. మరోవైపు ఉద్యోగులు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈరోజు మీరు పనిపై ద్రుష్టి పెట్టలేరు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇంటి వాతావరణం బాగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. ఈరోజు మీ ప్రియమైన వారి సహాయంతో, మీ పెద్ద సమస్యలు ఏవైనా ముగుస్తాయి. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో బాస్ మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 7 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో విద్యార్థులకు మంచిగా ఉండొచ్చు. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రయత్నిస్తున్నట్లయితే

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :37

లక్కీ టైమ్ : ఉదయం 6:25 నుండి ఉదయం 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. మీరు ఈరోజు గొప్ప పురోగతి సాధించగలరు. మరోవైపు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా మంచి అవకాశాన్ని పొందొచ్చు. వ్యాపారుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు నిర్ణయాలన్నీ చాలా తెలివిగా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీరు అనవసరమైన పనులకు డబ్బు ఖర్చు చేయొచ్చు. మీకు ఆస్తమా సమస్య ఉంటే, ఈరోజు మీకు మరింత ఇబ్బంది పెరగొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు శుభ ఫలితాలొస్తాయి. ఈరోజు మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, మీ పని ముందుకు సాగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ ఆదాయం మరియు ఖర్చుల బ్యాలెన్స్ ఉంచండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో విద్యార్థులు ఇతర విషయాలపై సమయం వ్రుథా చేయకుండా చదువుపై శ్రద్ధ వహించాలి. మరోవైపు మీరు చదువును పూర్తి చేసి, మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 9:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోని కొందరు సభ్యులతో గొడవలు రావొచ్చు. ఇలాంటి సమయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి. మరోవైపు మార్కెటింగ్ కు సంబంధించి పని చేసే వ్యక్తులకు ఈరోజు చాలా సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారులకు ఈరోజు కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు చర్చలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు న్యాయపరమైన చిక్కుల్లో పడొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు సమయం గురించి పూర్తి శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Thursday, May 19, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion