Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
Today Rasi Phalalu :ఈరోజు డబ్బు విషయంలో ఎవ్వరినీ నమ్మకండి...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, ఛైత్ర మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఇంటికి సంబంధించిన పని పూర్తవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు మీ సరైన ఆర్థిక నిర్ణయాల వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. ఉద్యోగులకు పురోగతికి సంబంధించి కొన్ని కొత్త మార్గాలు తెరచుకుంటాయి. వ్యాపారులు ఈరోజు గొప్ప విజయాన్ని పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే, మీ మందులను సకాలంలో తీసుకుంటూ ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ :21
లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉండొచ్చు. ఈరోజు మీరు మీ కోసం కూడా డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచడానికి, మీరు ఈరోజు నడవడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడుపుతుంటే, మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలను కూడా చర్చించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమన్వయం మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగా మీరు త్వరలో సరైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు అర్జించే మంచి అవకాశం లభిస్తుంది. వాతావరణంలో మార్పు కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు మీ వాదనలకు దూరంగా ఉండాలి. మీ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. ఈరోజు మీరు చాలా ఒత్తిడి మరియు అలసటను అనుభవిస్తారు. మీరు మీ బిజీ రొటీన్ నుండి మీ కోసం సమయాన్ని కూడా కేటాయించాలి. దీనివల్ల మీరు చాలా రిఫ్రెష్‌గా ఉంటారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు మీ ఖర్చులు తక్కువగా ఉండొచ్చు. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు మనసులో చాలా అలజడి ఉంటుంది. ఈరోజు మీరు ఏదో విషయంలో చాలా కలత చెందుతారు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ మనస్సును మీకు దగ్గరగా ఉన్న వారితో పంచుకోవాలి. బహుశా మీరు మీ సమస్యకు పరిష్కారం కనుగొంటారు. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన పనులకు ఆటంకం ఏర్పడొచ్చు. కానీ త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా బిజీగా ఉండబోతోంది. బాధ్యతల భారం మీపై ఎక్కువగా ఉంటుంది. వ్యాపారవేత్తలు డబ్బు విషయంలో ఎవరినీ విశ్వసించకూడదు. లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. మీ ఇంటి సభ్యులతో విభేదాలు తీవ్రమవుతాయి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి, ప్రతిరోజూ యోగా మరియు ధ్యానం సహాయం తీసుకోండి.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇది కాకుండా, మీరు క్రెడిట్ లావాదేవీలు చేయకుండా ఉండాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. మీరు పురోగమించాలనుకుంటే, ఇలాగే కష్టపడి పనిచేయండి. వ్యాపారస్తులు ఏదైనా కొత్త ఒప్పందాన్ని చేసుకునేటప్పుడు అతి విశ్వాసాన్ని నివారించాలి. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకుంటే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉండే అవకాశం ఉంది. మీకు కొందరు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. మీ దుష్ప్రవర్తన మీ మనోభావాలను దెబ్బతీస్తుంది. ఈరోజు మీకు జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :14
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 7:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు చాలా రిఫ్రెష్‌గా ఉంటారు. అలాగే మీరు సానుకూల భావాన్ని కూడా అనుభవిస్తారు. మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. ఆఫీసులో మీ శ్రమ మరియు అంకితభావాన్ని చూసి ఉన్నతాధికారులు మీ పట్ల చాలా సంతోషిస్తారు. ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను అప్పగించొచ్చు. మీరు ఈ పనిని సకాలంలో పూర్తి చేస్తే, మీ పురోగతి కచ్చితంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మీ ఈ ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఈరోజు మీరు ఇంటి మరమ్మతులు మొదలైనవాటికి కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు కోరుకున్న బదిలీని పొందొచ్చు లేదా మీరు ఉన్నత స్థానాన్ని కూడా పొందొచ్చు. మరోవైపు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు ఈరోజు ఎక్కువగా కష్టపడాల్సి రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఈ సమయంలో ఎక్కువ ఖర్చు చేయడం మంచిది కాదు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామితో కొంత వివాదం ఉండొచ్చు. కానీ త్వరలో మీ మధ్య ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కొంత క్షీణంచొచ్చు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :2
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 6:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో చాలా మంచిగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఈరోజు మీరు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఈ రాశికి చెందిన వివాహితులకు ఈరోజు కష్టతరమైన రోజుగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క దుష్ప్రవర్తన మిమ్మల్ని అసంతృప్తికి గురి చేస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఈరోజు మీరు పిల్లల చదువుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. విదేశీ కంపెనీలో పనిచేసే వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. మరోవైపు ఈరోజు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం బలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :16
లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా అదృష్టకరంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈరోజు మంచి సమయం. మీరు విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశం లభిస్తుంది. అదే సమయంలో, ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు బాస్ మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని ఆనందకరమైన వార్తలను అందుకుంటారు. మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :32
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత పనిని చేయడానికి ప్రయత్నించండి. మీ సహోద్యోగుల నుండి ఎక్కువగా ఆశించొద్దు. లేకుంటే మీరు నిరాశ చెందుతారు. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు కొత్త ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించకూడదు. వ్యాపారులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు మీరు నిలిచిపోయిన ప్రణాళికను మళ్లీ ప్రారంభించడానికి చాలా కష్టపడాల్సి రావొచ్చు. ఈరోజు మీ ఆవేశపూరిత స్వభావాన్ని కూడా విమర్శించొచ్చు. మీకు కంటికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి 8:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో మంచి ఫలితాలను పొందొచ్చు. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు చిన్న పనిని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు ఒక్క తప్పు చేసినట్లయితే, మీరు తప్పుడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అదే సమయంలో, వ్యాపారులు ఈరోజు పనిని విస్తరించడానికి ప్లాన్ చేయొచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :13
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో విద్యార్థులకు చాలా అదృష్టవంతమైన రోజు. మీరు అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది. మీరు కుటుంబపరంగా మంచి ఫలితాలను పొందొచ్చు. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు, మీ జీవిత భాగస్వామితో, మీరు కూడా ఒక అందమైన ప్రదేశానికి నడక కోసం వెళ్ళొచ్చు. ఇది కాకుండా, మీరు మీ ప్రియమైన వారికి బహుమతులు కూడా కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో మీ ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టాలి. సహోద్యోగులతో ఎక్కువగా గాసిప్ చేయడం మానుకోండి. వ్యాపారస్తుల ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు చాలా తెలివిగా ఉంటారు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :20
లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 11:30 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











