Latest Updates
-
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే..
Today Rasi Phalalu : ఓ రాశి అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావొచ్చు...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, కార్తీక మాసంలో ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
Monthly Horoscope: నవంబర్ మాసంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. కొందరు కుటుంబ సభ్యులతో మీ సాన్నిహిత్యం కారణంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు రావొచ్చు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే మీ కుటుంబ ఐక్యతకు భంగం వాటిల్లొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూలంగా ఉంటుంది. మీరు ఉత్తమమైన ప్రదర్శన కనబరుస్తారు. మరోవైపు, వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు మిశ్రమ రోజుగా భావిస్తున్నారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈ సమయంలో మీరు ఎలాంటి మార్పులకైనా దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు కడుపులో సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీ కోసం మీకు తగినంత సమయం లభించకపోవచ్చు. అయితే, మీరు పనితో పాటు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వంతుగా కష్టపడి పని చేయాలి. మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు అవివాహితులైతే, ఈరోజు మీకు మంచి వివాహ ప్రతిపాదన రావొచ్చు. త్వరలో మీరు ఓ ఇంటి వారు కావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా పాత రుణాన్ని పూర్తిగా చెల్లిస్తారు.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో విభేదాలు పెరగొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు కోపంతో కాకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. మీరు సమస్యను తెలివిగా నిర్వహించకపోతే, మీ సంబంధం కూడా విచ్ఛిన్నమవుతుంది. శృంగార జీవితానికి సంబంధించి అనవసరమైన విషయాల గురించి మీ భాగస్వామిని అనుమానించకుండా ఉండండి. మీరు ఈ అలవాటును మార్చుకోవడంలో విఫలమైతే, మీ మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతాయి. మరోవైపు ఉద్యోగులు ఆఫీసులో పని చేసేటప్పుడు తొందరపడకండి. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా గందరగోళంగా ఉండొచ్చు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారు ఈరోజు కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి రావొచ్చు. ఇప్పుడు ఉన్నదానితో సంతృప్తి చెందడం మంచిది. ఈ సమయంలో ఎక్కువ ఆశించొద్దు. లేకపోతే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించొచ్చు. మీ ఆత్మవిశ్వాసానికి ఉన్నతాధికారులు చాలా ఆకట్టుకుంటారు. ఈరోజు మీకు పెద్ద మరియు ముఖ్యమైన పనిని కూడా అప్పగించొచ్చు. వ్యాపారులకు ఈరోజు చాలా లాభదాయకమైన రోజు. మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఈరోజు ఎలాంటి సమస్యా ఉండదు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీకు నరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో పనితీరు సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో మీ సాన్నిహిత్యం మెరుగుపడొచ్చు. ఈరోజు మీరు పై అధికారుల మార్గదర్శకత్వం పొందుతారు. మరోవైపు, ఈరోజు వ్యాపారులకు సవాలుగా ఉండే రోజు. మీరు కొనసాగుతున్న ఏదైనా పని మధ్యలో అకస్మాత్తుగా చిక్కుకోవడం వల్ల మీకు ఆర్థిక నష్టం జరగొచ్చు. మీరు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తుంటే, ఈరోజు మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి యొక్క అజాగ్రత్త వైఖరి మీ సమస్యలను పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 10:35 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే బలమైన అవకాశం ఉంది. మీరు మీ ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగించొచ్చు. కళా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మరోవైపు, వ్యాపారవేత్తలు లాభాలను సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ మీరు ఆశించిన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో మృదుత్వం ఉంటుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు ఈరోజు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 35
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితిని సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీ గందరగోళాల నుండి బయటపడండి. మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, ఉన్నతాధికారులతో మీ సమన్వయం కూడా క్షీణించొచ్చు. మీ కోపం స్వభావం కూడా ఈరోజు మీ పనిని ప్రభావితం చేస్తుంది. వ్యాపారస్తులు అకస్మాత్తుగా దూర ప్రయాణాలు చేయవలసి రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో విభేదాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతున్నట్లయితే, మీరు దానిని నివారించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆస్తికి సంబంధించిన పనులు చేస్తుంటే, ఈరోజు ఏదైనా వ్రాతపని చేసేటప్పుడు తొందరపడకండి. లేకుంటే మీరు నష్టపోవచ్చు. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఆకట్టుకోవడానికి అధిక పని ఒత్తిడిని నివారించాలి. ఒకసారి ఒక పనిని మాత్రమే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉండొచ్చు. ఈరోజు మీ పెద్ద చింతలు తొలగిపోతాయి. మీ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. మీరు ఇంట్లో పెద్ద సభ్యుడిగా ఉన్నట్లయితే, మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో సామరస్యం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి రాత్రి 8:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో నిరాశజనకంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు అజాగ్రత్తగా ఉండొద్దు. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు పెద్ద లాభాలను ఆశించినట్లయితే, మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేరు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ బడ్జెట్‌కు మించి వెళ్లొద్దు. మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేటప్పుడు, మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమపూర్వక ప్రవర్తన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. మరోవైపు ఈరోజు మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు పనిలో మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటే, మీ ప్రిపరేషన్‌పై పూర్తి శ్రద్ధ పెట్టాలి. మీరు త్వరలో విజయం సాధించొచ్చు. వ్యాపారులకు ఈ సమయం చాలా అదృష్టం రావొచ్చు మీరు తక్కువ శ్రమతో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా మంచి రోజు. మీరు అకస్మాత్తుగా డబ్బు పొందొచ్చు. ఈరోజు మీరు మీ ఇంటి డెకర్‌ని మార్చడానికి అవసరమైన కొన్ని కొనుగోళ్లను కూడా చేయొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతును పొందుతారు. ముఖ్యంగా ఈరోజు మీరు పిల్లలతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఆరోగ్య విషయాలు చక్కగా ఉంటాయి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో మంచి వాతావరణం ఉంటుంది. అయితే మీరు అందరితో మంచిగా ప్రవర్తించాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు ఈరోజు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. అలాగే మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీరు అవసరానికి మించి ఖర్చు చేయడం మానుకోండి. మీరు పని విషయంలో మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో మంచి గౌరవం లభిస్తుంది. ఈరోజు ఉన్నతాధికారులతో పాటు బాస్ కూడా మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. వ్యాపారులకు ఈరోజు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గొప్ప అవకాశాన్ని పొందొచ్చు. ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈరోజు మీకు చాలా ముఖ్యమైనది. ఆర్థిక పరంగా, ఈరోజు మీకు గొప్ప అవకాశాన్ని తెస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో అదనపు సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు పరంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి సాయంత్రం 5 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











