Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Ugadi 2023: ఈ ఏడాది ‘ఉగాది’ ఎప్పుడొచ్చింది? ఈరోజున పచ్చడి ఎందుకు చేస్తారో తెలుసా...
ఉగాది 2023 తేదీ, సమయం, ఆచారాలు, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. ఈ పండుగను తెలుగు వారంతా ఘనంగా జరుపుకుంటారు.

తెలుగు ప్రజలందరూ ఉగాది రోజు నుంచే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినట్టు భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2023 సంవత్సరంలో మార్చి 22బుధ వారం రోజున ఈ పండుగ వచ్చింది.

ఈరోజునే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తమ రాశి చక్రాల జాతకలు, గ్రహాల స్థితిని అంచనా వేస్తారు. తమ జాతకంలో ఏవైనా దోషాలుంటే వాటి శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం, నివారణలు పాటించడం వంటివి చేస్తారు.

మరికొన్ని రోజుల్లో మనం 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సందర్భంగా ఉగాది పండుగ చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తెలుగు రాష్ట్రాల్లో..
ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఉగాది పచ్చడిని కచ్చితంగా రుచి చూస్తారు. పచ్చడిలో షడ్రుచులు ఎంతో రుచికరంగా ఉంటాయి. కర్నాటకలోనూ యుగాది పేరిట ఈ పండుగను జరుపుకుంటారు. తమిళనాడులో ‘పుత్తాండు' అని, మలయాళంలో విషు అని, సిక్కులు వైశాఖీ అని, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్, మహారాష్ట్రలో గుడిపడ్వా అనే పేర్లతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో, కర్నాటకలో ఈ పవిత్రమైన రోజున కచ్చితంగా పంచాంగ శ్రవణం జరుపుతారు.

పురాణాల ప్రకారం..
హిందూ పురాణాల ప్రకారం, ఛైత్ర మాసంలో శక్ల పక్షం పాడ్యమి రోజున ఈ అనంతమైన లోకాన్ని బ్రహ్మ దేవుడు స్రుష్టించడాని.. ఆ రోజు నుండే ఈ లోకం ప్రారంభమయ్యిందని పండితులు చెబుతారు. అలాగే వేదాలను హరించిన సోమకుని వధించేందుకు విష్ణువు మత్స్యవతారంలో వచ్చిన రోజునే ఉగాది పండుగగా జరుపుకుంటారని చెబుతుంటారు.

వసంత రుతువు..
ఉగాది పండుగ రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. చరిత్రను పరిశీలిస్తే.. శాలివాహన చక్రవర్తి ఛైత్ర శుక్ల పాడ్యమి రోజునే పట్టాభిషిక్తుడయ్యాని.. ఈరోజునే ఉగాదిని జరుపుకోవడం సంప్రదాయంగా వచ్చిందని కూడా చెబుతారు. ‘ఉగ' అంటే నక్షత్ర గమనం.. జన్మ ఆయుష్షు అనే అర్థాలొస్తాయి. అలాగే యుగం అంటే ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతాన్ని యుగం అంటారు. ఈ యుగానికి ఆది యుగాదిగా మారిందని.. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగానే ఈ ఉగాది వచ్చిందని పెద్దలు చెబుతంటారు.

ఉగాది పచ్చడి ఎందుకంటే..
ఉగాది రోజున పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చస్తారు. ఈ షడ్రుచులు మన జీవితంలోని అనేక విషయాలను సూచిస్తుంది. మన లైఫ్ లో జరిగే అన్ని రకాల ఫీలింగ్స్ ఈ పచ్చడిలో ఉంటాయని చాలా మంది నమ్ముతారు. పచ్చడి తయారీలో వాడే ఒక్క పదార్థానికి ఒక్కో అర్థం ఉంటుంది.

షడ్రుచుల అర్థాలు..
1) బెల్లం తియ్యదనానికి.. సంతోషానికి ప్రతీకగా భావిస్తారు.
2) వేప పువ్వు చేదుతనానికి అంటే బాధలు, దుఃఖాన్ని గుర్తు చేస్తుంది.
3) పులుపు వంటి రుచులు మనం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది.
4) ఉప్పు మన జీవితంలో జరిగే ఉత్సాహం, రుచికి సంకేతంగా భావిస్తారు.
5) పచ్చి మామిడి ముక్కలు వగరు అంటే కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది.
6) కారం అంటే మనం సహనం కోల్పోయే లేదా కోపం పడే పరిస్థితులను సూచిస్తుంది.



Click it and Unblock the Notifications