Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ..
దేశవ్యాప్తంగా ఇవాళ రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీలకు కడుతున్నారు. సాధారణంగా రాఖీ అనగానే సోదరీమణులు తమసోదరులకు తోడబుట్టకపోయినా కూడా సోదరుడిగా భావించే వారికి రాఖీ కడతారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ భార్యలు తమ భర్తలకు కూడా రాఖీ కట్టవచ్చు అన్న విషయం మీకు తెలుసా?
పురాణాలు ఏం చెబుతున్నాయి?
హిందూ ధర్మశాస్త్రాలు, పురాణాల ప్రకారం భార్యలు తమ భర్తకు రాఖీ కట్టవచ్చు. భవిష్య పురాణం ప్రకారం భార్య తన భర్తకు రాఖీ కట్టే సంప్రదాయం అనాదిగా వస్తోంది. పురాణ గాథల ప్రకారం..ఒకానొక సమయంలో దేవతలకు, రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ పోరులో దేవతల రాజైన ఇంద్రుడు కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది.

తన భర్త కష్టాల్లో ఉన్నాడని గమనించిన ఇంద్రుని భార్య శచీదేవి (ఇంద్రాణి), అతని విజయాన్ని, ప్రాణ రక్షణను కాంక్షిస్తూ ఇంద్రుని మణికట్టుకు ఒక పవిత్రమైన రక్షా సూత్రాన్ని కడుతుంది. ఆ రక్షాబంధనం ఇచ్చిన శక్తితో ఇంద్రుడు యుద్ధంలో ఘనవిజయం సాధిస్తాడు.
భార్యాభర్తల బంధంలో రాఖీ ప్రాముఖ్యత
దీనిని బట్టి చూస్తే, ఆపద సమయంలో భర్తకు అండగా నిలుస్తూ, అతని క్షేమాన్ని, విజయాన్ని కోరుకుంటూ భార్య రాఖీ కట్టడం అనేది మన పురాణాలు ఆమోదించిన సత్యమే అని స్పష్టమవుతోంది. వాస్తవానికి, భార్యాభర్తల బంధం అంటేనే ఒకరికొకరు తోడునీడగా, రక్షకులుగా ఉండే ఒక అద్భుతమైన ప్రయాణం. జీవితాంతం కష్టసుఖాల్లో కలసి నడిచే దంపతులు, ఒకరికొకరు అండగా నిలబడతామని ఈ పండుగ సాక్షిగా ప్రమాణం చేసుకోవడంలో ఎంతో మాధుర్యం ఉంది.
రాఖీ కట్టడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. ఎదుటివారి క్షేమాన్ని కోరుకునే ఒక పవిత్రమైన భావన. సమాజంలో ఉన్న అపోహలను పక్కనపెట్టి, రాఖీ వెనుక ఉన్న అసలైన రక్షణ అనే అర్థాన్ని గ్రహిస్తే.. భార్య తన భర్తకు ప్రేమతో రక్షాబంధన్ కట్టడం అనేది అత్యంత శుభకరం.



Click it and Unblock the Notifications
