Latest Updates
-
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా?
మనదేశంలో చెత్త లేదా వేస్టేజ్ కావాలి అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. చెత్తను చెత్తకుండీలోనే వేయడం మనదేశంలో చాలామందికి లేని అలవాటు. పక్కన డస్ట్ బిన్ ఉన్నా కూడా అందులో చెత్త వేయకుండా కింద పడేసే మహానుభావులకి మన దగ్గర కొదవే లేదు. నదులు, సముద్రాలు, రోట్డు, బస్సులు, రైళ్లు ఇలా ఎక్కడ చూసినా చెత్తమయం చేస్తుంటారు.
స్వఛ్చ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా వందల,వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటది. అయినా మనుషుల్లో మార్పు రానంతవరకు ఎన్ని కోట్లుపెట్టినా ప్రయోజనం ఉండదు. ఇదిలా ఉంటే ప్లీజ్ మాకు చెత్త కావాలి అంటూ అంటోంది ఓ దేశం.

177 దేశాలతో కూడిన వేస్ట్ మేనేజ్ మెంట్ లిస్ట్ లో ఎస్టోనియా అగ్రస్థానంలో (అత్యంత పరిశుభ్రమైనదిగా) నిలవగా, మన భారతదేశం 176వ స్థానంలో అత్యంత వెనుకబడి ఉంది. గతంతో పోలిస్తే మన పరిస్థితి కొంచెం మెరుగైనప్పటికీ, ఇంకా చెత్త సమస్యలు మనల్ని వేధిస్తూనే ఉన్నాయి.
భారత్ సహా అనేక దేశాలు తమ నగరాల్లో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తను ఎలా వదిలించుకోవాలో, ఎక్కడ డంప్ చేయాలో తెలియక సతమతమవుతున్నాయి. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశాల్లో 5వ స్థానంలో ఉన్న స్వీడన్ మాత్రం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసి టన్నుల కొద్దీ చెత్తను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.
ఆ చెత్తను ఏం చేస్తోంది?
స్వీడన్ టన్నుల కొద్దీ చెత్తను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న అత్యాధునిక వేస్ట్ టు ఎనర్జీ (వ్యర్థాల నుంచి శక్తి) ప్లాంట్లు. ఈ భారీ ఫ్యాక్టరీలకు చెత్తే ప్రధాన ముడిసరుకు. వృధాగా పడి ఉండే వ్యర్థాలను ఉపయోగించి వారు తమ దేశానికి అవసరమైన కరెంట్, హీట్ ని ఉత్పత్తి చేసుకుంటున్నారు.
గడ్డకట్టే చలిలో... ఇళ్లకు వెచ్చదనం
స్వీడన్ ప్రపంచంలో అత్యంత చలిగా ఉండే దేశాల్లో ఒకటి. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయి. ఆ కఠినమైన చలిలో ఇళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి వారు ఈ చెత్తనే అద్భుతంగా ఉపయోగిస్తారు. వ్యర్థాలను భారీ కొలిమిల్లో దహనం చేయడం ద్వారా పుట్టే అపారమైన వేడిని, భూగర్భంలో ఏర్పాటు చేసిన పైపుల నెట్ వర్క్ ద్వారా నేరుగా లక్షలాది ఇళ్లకు, అపార్ట్ మెంట్లకు సరఫరా చేస్తారు. దీనివల్ల కరెంటుతో పనిలేకుండానే ఇళ్లు ఎంతో వెచ్చగా ఉంటాయి.
చెత్తతో కరెంటు.. రోడ్ల నిర్మాణం
రీసైకిల్ చేయడానికి వీలుకాని ప్లాస్టిక్, ఇతర చెత్తను దహనవాటికల్లో అత్యధిక ఉష్ణోగ్రతల దగ్గర మండిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా వెలువడే ఉష్ణ శక్తిని విద్యుత్ గా మార్చి దేశవ్యాప్తంగా లక్షలాది ఇళ్లకు, కార్యాలయాలకు సరఫరా చేస్తున్నారు. అంతేకాదు చెత్తను మండించగా మిగిలిన బూడిదను, ఇతర సూక్ష్మ వ్యర్థాలను అత్యంత జాగ్రత్తగా వేరుచేస్తారు. వాటిని దృఢమైన రోడ్ల నిర్మాణంలోనూ, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగానూ వాడుతున్నారు. అంటే ఆ దేశంలో ఏ ఒక్క వస్తువూ వృధా కాదన్నమాట.
కాసుల వర్షం కురిపిస్తున్న వ్యర్థాలు
ఇతర దేశాల నుంచి చెత్తను దిగుమతి చేసుకోవడం స్వీడన్ కు అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారింది. తమ దేశంలో చెత్తను భారీ డంపింగ్ యార్డుల్లో పారబోయలేక ఇబ్బంది పడుతున్న దేశాలు, ఆ చెత్తను తీసుకుంటున్నందుకు స్వీడన్ కు ఎదురు డబ్బులు చెల్లిస్తున్నాయి. అటు చూస్తే చెత్త వదిలిపోయిందని ఆయా దేశాలకు సంతోషం, ఇటు చూస్తే డబ్బుతో పాటు ఉచిత ఇంధనం, విద్యుత్ లభిస్తున్నందుకు స్వీడన్ కు లాభం. ఒకరి పాలిట పెను సమస్యగా ఉన్న చెత్తను, స్వీడన్ తన పాలిట అక్షయపాత్రగా మార్చుకున్న తీరు నిజంగా అద్భుమనే చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications
