Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.!
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఉపాధ్యాయులు- విద్యార్థుల మధ్య బంధం కేవలం క్లాస్ రూమ్ పుస్తకాలు, హోం వర్క్, పరీక్షలతో మాత్రమే ముడిపడి ఉంటుందా.. అంటే కాదనే చెప్పాలి. గురువు అంటే పుస్తక జ్ఞానం అందించడం మాత్రమే కాదు. దానికి మించి సమాజంలో ఎలా బతకాలి, సవాళ్లను ఎదుర్కోవాలి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏం ఆలోచించాలి.. ఇంకా ఎన్నో.. ఒక్కోసారి మీ గురువు క్లాస్‌రూమ్‌లో చెప్పిన చిన్న విషయం మీ జీవితాన్నే మార్చేయగలదు. అక్షరాభ్యాసం చేసిన నాటి నుంచి మన జీవితంలో ప్రతి అడుగులో మనకు పాఠాలు బోధించిన గురువు ముద్ర ఉంటుంది. అలాంటి మహనీయుల నుంచి మనం తప్పనిసరిగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అవేంటంటే..

జీవితంలో విజయం సాధించడమంటే మంచి మార్కులు, సంపాదనే కాదని ప్రతి గురువు బోధించే తొలి మాట. సమాజంలో మంచి వ్యక్తిగా మారడం, తెలిసీతెలియక చేసిన తప్పులు, పొరపాట్ల నుంచి నేర్చుకోవడం, ఇతరులను గౌరవించడం ఇవన్నీ మీరు సాధించే విజయాలే. చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు చేసే చిన్న మందలింపు కూడా మన భవిష్యత్తు కోసమే. అందుకే మన గుర్తింపును, విజయాన్ని ఎప్పుడూ డిగ్రీలు, వృత్తులతో మాత్రమే కాదు.. మన వెనకుండి మన ఫ్యూచర్‌కి మార్గనిర్దేశనం చేసిన గురువుల పాత్ర ఎంతో ఉంటుంది. అలాంటి గురువుల నుంచి విద్యాబోధన, సంస్కారంతో పాటు కొన్ని కీలకమైన పాఠాలను గుర్తుంచుకోవాలి.
లక్ష్యానికి షార్ట్ కట్ లేదు
మీ జీవితంలో లక్ష్యం ఏదైనా దానిని సాధించాలంటే షార్ట్ కట్స్ ఉండవని గుర్తుంచుకోవాలి. పుస్తకాలు నేర్పని జ్ఞానం ఇదే. మన గురువులు మనకు చెప్పే ప్రధాన మాట ఇదే. లక్ష్య సాధనకు నిరంతర కృషి చాలా అవసరం. ప్రతిభతో పాటు కఠోర శ్రమ, క్రమశిక్షణ మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది.

తప్పులకు తలొగ్గద్దు
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పులు చేయడం సహజం. మనం తప్పు చేస్తే గురువు మందలించడమే కాదు.. ఆ తప్పుల నుంచి నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మన పొరపాట్లను అర్థం చేసుకుని వాటిని పునరావృతం చేయకుండా చూసుకోవాలి.
సమయ పాలన, టైం విలువ
స్కూల్, కాలేజీల్లో చదువుకునేటప్పుడు హోం వర్క్ అయినా క్లాస్ వర్క్ అయినా లేదా క్లాస్‌కి అటెండ్ అవ్వడం అన్నీ సరిగ్గా టైంకి పూర్తి చేసుకుంటాం. ఆ అలవాటు అనేది మనకు అప్పటి నుంచే ఉండటం భవిష్యత్తులో సరైన జీవనశైలికి దోహదపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ అలవాటు అనేది గురువుల నుంచి నేర్చుకుంటాం. అదే మనల్ని బాధ్యతాయుతమైన, క్రమబద్ధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది.
ఓటమితో జీవితం అయిపోదు..
పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం లేదా ఓడిపోవడం, ఓటమిని ఎదుర్కొంటే అక్కడితోనే మీ జీవితం అంతం కాదనే విషయాన్ని గురువులు మనకు బోధిస్తారు. వైఫల్యాన్ని బలహీనతగా భావించకుండా, దాని నుంచి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలని ఉపాధ్యాయులు మనకు బోధిస్తారు. ఇదే తదుపరి ప్రయత్నాలకు ఊపిరినిస్తుంది.

ఇతరుల పట్ల గౌరవం
చదువు అందించే జ్ఞానంతో పాటు సమాజంలో బతకాలంటే విలువలు కూడా చాలా కీలకం. తోటి విద్యార్థులను, పేరెంట్స్‌ను, పెద్దలను ప్రతి ఒక్కరినీ గౌరవించాలనే విషయాన్ని గురువులు మనకు నేర్పిస్తారు. ఇలాంటి వ్యక్తిత్వంతో మీరు సమాజంలో గౌరవం అందుకుంటారు.

నిరంతరం నేర్చుకోవడం..
మనకు తెలియని ప్రతి విషయం నేర్చుకోవడం అస్సలు తప్పు కాదని గురువులు మనకు బోధిస్తారు. ఏదైనా నేర్చుకోవడానికి జిజ్ఞాస మొదటి మెట్టుగా భావించాలి. అందులో భాగంగా ప్రశ్నలు అడగడానికి, అన్వేషించడానికి, మన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి గురువులు మనకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ అలవాటు ద్వారా మీరు జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోవడం సులభం అవుతుంది. నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ముగియదని గమనించాలి. కొత్త అంశాల ద్వారా ప్రతిరోజూ మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. ఇది భవిష్యత్తు విజయాలకు దోహదపడుతుంది.



Click it and Unblock the Notifications