Latest Updates
-
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
మామిడి పండ్లను ఫ్రిజ్ లో పెట్టొచ్చా లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేసవిలో చాలామంది వీకెండ్స్ రాగానే మార్కెట్లకు లేదా మామిడి తోటలకు వెళ్లడం, అక్కడి నుంచి బుట్టల కొద్దీ పండ్లను బల్క్ గా కొనుక్కుని ఇంటికి తెచ్చుకోవడం సర్వసాధారణం. అయితే, ఇంత పెద్ద మొత్తంలో తెచ్చిన పండ్లను ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా దాచుకోవాలి? అనేది చాలా ఇళ్లల్లో గృహిణులకు వచ్చే పెద్ద సందేహం. కొందరు మార్కెట్ నుంచి పండ్లను తెచ్చిన వెంటనే వాటిని తీసుకెళ్లి నేరుగా ఫ్రిజ్ లో కుక్కేస్తుంటారు. మరికొందరు మాత్రం బుట్టల్లో లేదా గదిలో ఒక మూలన నిల్వ చేస్తుంటారు. అసలు మామిడి పండ్లను ఫ్రిజ్ లో పెట్టవచ్చా లేదా? పండ్లు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

పచ్చి మామిడి పండ్లను ఫ్రిజ్ లో పెట్టకండి
మీరు తోటల నుంచి లేదా మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చిన మామిడి పండ్లు ఇంకా పచ్చిగానే ఉన్నాయా? అయితే పొరపాటున కూడా వాటిని ఫ్రిజ్ లో పెట్టకండి. పచ్చిగా ఉన్నవి లేదా సగం పండిన మామిడి కాయలను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద (రూమ్ టెంపరేచర్) మాత్రమే నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్లే అవి సహజంగా, నెమ్మదిగా పండుతాయి. ఫ్రిజ్ లో ఉండే చల్లటి వాతావరణం మామిడి పండ్లు పండే ప్రక్రియను పూర్తిగా ఆపుతుంది. అంతేకాకుండా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటి సహజమైన రుచి, సువాసన దెబ్బతింటాయి. కాబట్టి పండ్లు పూర్తిగా పండే వరకు వాటిని బయటే ఉంచడం బెటర్.
పూర్తిగా పండిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టొచ్చా?
మామిడి పండు పూర్తిగా పండిపోయి, అద్భుతమైన సువాసన వస్తున్నప్పుడు.. దానిని అలాగే బయట ఉంచితే త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాత్రమే మీరు ఆ పండ్లను ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు. పూర్తిగా పండిన మామిడి పండ్లను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అవి కనీసం 4 నుంచి 5 రోజుల పాటు ఏమాత్రం చెడిపోకుండా ఎంతో తాజాగా ఉంటాయి. చల్లగా ఉన్న పండును కట్ చేసుకుని తింటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. అయితే,ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. పండ్లను అతిగా చల్లబరచడం వల్ల పండు ఆకృతి, రుచిలో స్వల్పంగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవసరం ఉన్నప్పుడే వాటిని ఫ్రిజ్ లో ఉంచండి.

పండ్లు పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
మీరు తెచ్చిన మామిడి పండ్లు త్వరగా, సమానంగా పండాలని అనుకుంటే..ఒక్కో పండును విడివిడిగా పాత న్యూస్ పేపర్ లో చుట్టి ఒక సంచిలో లేదా అట్టపెట్టెలో ఉంచండి. ఇలా చేయడం వల్ల పండ్ల నుంచి విడుదలయ్యే గ్యాస్ బయటకు పోకుండా ఉండి, పండ్లు చాలా త్వరగా, సహజంగా పండుతాయి.
మామిడి పండ్లను ఎప్పుడూ నేరుగా సూర్యరశ్మి పడే చోట లేదా వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచకూడదు. ఎండ వేడికి లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల అవి త్వరగా కుళ్ళిపోతాయి. గాలి బాగా ఆడే, పొడిగా ఉండే గది ఉష్ణోగ్రత వద్ద పండ్లను నిల్వ చేసినట్లయితే అవి ఎక్కువ కాలం పాటు ఫ్రెష్ గా ఉంటాయి.
ఒక్కోసారి పెద్ద మామిడి పండును కోసినప్పుడు, సగం తిని మిగతా సగం వదిలేస్తుంటాం. అలా మిగిలిపోయిన మామిడి పండు ముక్కలను ప్లేట్ లో పెట్టి ఫ్రిజ్ లో అలాగే ఓపెన్ గా ఉంచేయకండి. దీనివల్ల పండ్లు గాలికి ఎండిపోయి పాడవుతాయి. కట్ చేసిన మామిడి ముక్కలను ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలో పెట్టి మాత్రమే ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే వాటి రుచి, తాజాదనం అస్సలు తగ్గవు.



Click it and Unblock the Notifications
