Latest Updates
-
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'!
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.!
ఓ వైపు భారీ వర్షం. మరోవైపు రోడ్డుపైన మోకాళ్ల లోతు వరద నీరు. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికే జుంకుతారు. కానీ ఈ మందుబాబులు మాత్రం అందుకు భిన్నం.. వర్షం మా సంతోషాలకు అడ్డు కాదంటూ ఎంచక్కా రెయిన్ కోట్ వేసుకుని మద్యం తాగుతూ చిల్ అవుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

రెయిన్ కోట్ ధరించి, డిస్పోజల్ గ్లాసుల్లో ముందు పోసుకుని వర్షంలోనే చీర్స్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇద్దరు యువకులు. ఓ వైపు కుండపోత వర్షంతో రోడ్డుపైన మోకాళ్ల లోతు వరద నీరు చేరినా.. అదేమీ పట్టనట్లు వర్షంలో తడవకుండా రెయిన్ కోట్ వేసుకుని రోడ్డుపైనే గట్టుపైన కూర్చుని మద్యం సేవిస్తున్నారు. అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బయట చిక్కుకున్న జనాలు వరద నీటిలో పడవల్లో వెళ్లడం లేదా బైక్ మునుగుతున్నా రోడ్డు దాటేందుకు నానా తిప్పలు పడటం, కార్లలో అవస్థలు, వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోవడం ఇలా చాలా చూస్తూ ఉంటాం. కానీ ఈ సంఘటన మాత్రం అందుకు భిన్నం. దీంతో ఈ వీడియో నెటిజన్లను ఆకర్షించడంతో పాటు చర్చకు దారి తీసింది.
ఇలా రోడ్డుపై భారీ వర్షంలో, వరదలో ఇద్దరు యువకులు ఎలాంటి టెన్షన్, వణుకు, ఆందోళన లేకుండా మద్యం తాగుతూ ఉన్న వీడియోను సమీపంలోని భవనం నుంచి కొందరు వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. సడెన్‌గా చూస్తే ఏ నది ఒడ్డునో అనుకుంటారు. కానీ తరచి చూస్తే కానీ వీళ్లు చేసిన సాహసం ఏంటనేది అర్థం కాదు.
నెటిజన్ల రియాక్షన్
ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా ఆస్వాదించాలో వీరికి తెలుసంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. లో బడ్జెట్‌లో ఇంతకు మించిన డ్రింకింగ్ స్పాట్ ఉండదంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. చిల్ అవ్వడానికి ఈ కొత్త ప్లేస్ బాగుందంటూ వ్యాఖ్యలు చేశారు. స్నేహానికి నిర్వచనంగా ఇంతకు మించిన ఉదాహరణ లేదంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో యువకుల తీరుపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
వర్షాన్ని ఆస్వాదించాలనుకోవడం మంచి నిర్ణయమే.. కానీ ఇలా వరద నీరు నిలిచిన ప్రదేశాల్లో ఇంత అజాగ్రత్తగా కూర్చోవడం సరికాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో డ్రైనేజీ లీకేజ్‌ల భయం, వాటిపై మూతలు లేకపోయినా, లేదా కరెంట్ వైర్లు తెగి పొరపాటున నీళ్లలో పడినా తీరని నష్టం వాటిల్లుంతుందని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటివి చేయడానికి, చూడటానికి బాగానే ఉన్నా.. వర్షం పడుతుండగా రోడ్డుపై ఇలాంటి చర్యలు ప్రమాదకరమని పేర్కొంటున్నారు.
వర్షాకాలంలో విద్యుదాఘాతం, చెట్ల కొమ్మలు విరిగిపడటం, పిడుగుల పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫన్ కోసం ఇలా చేయడం సరికాదంటున్నారు. వీరిని చూసి మరొకరు ఇలా అనుకరించే అవకాశం ఉందని.. ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్న చర్యలకు పాల్పడకుండా భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ సంఘటన ముంబైలో జరిగినట్లుగా సమాచారం.



Click it and Unblock the Notifications
