Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
UPSC CSE 2022 Results: యూపీఎస్సీ సివిల్స్‌లో అమ్మాయిలదే హవా.. టాప్ 10లో ఆరుగురు వాళ్లే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది. 933 మందిలో IAS సర్వీసెస్ కు 180 మంది ఎంపికయ్యారు. అలాగే IFSకు 38 మంది, IPSకు 200 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ. తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 ఫలితాల్లో అమ్మాయిలే హవా కనబరిచారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 ఫలితాల్లో మొదటి ర్యాంకును ఇషితా కిషోర్ టాపర్ గా నిలిచింది. గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచింది. ఉమా హాథిన్ మూడో స్థానం దక్కించుకున్నారు.
గతేడాది సెప్టెంబర్ లో జరిగిన సివిలస్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022, జనవరి-మే 2023లో జరిగిన పర్సనాలిటీ ఇంటర్వ్యూల ఆధారంగా మెరిట్ జాబితాను యూపీఎస్సీ ఇవాళ ప్రకటించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసీ, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ కోసం మొత్తం 933 మంది అభ్యర్థుల్ని సిఫార్సు చేశారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ, గ్రూప్-బి కి నియామకం కోసం మొత్తంగా 1.22 మంది అభ్యర్థుల్ని సిఫార్సు చేశారు.
యూపీఎస్సీ సిఫార్సు చేసిన 933 మంది అభ్యర్థుల్లో 345 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు. 99 మంది ఈడబ్ల్యూఎస్ కోటాకు చెందిన వారు కాగా.. 263 మంది ఓబీసీ కోటా అభ్యర్థులు ఉన్నారు. ఎస్సీ కోటా నుండి 154 మంది, ఎస్టీ కోటా నుండి 72 మంది ఉన్నారు.
అమ్మాయిలదే హవా...
ఈ ఏడాది విడుదలైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అమ్మాయిలు ప్రతిభ కనబరిచారు. మొదటి ర్యాంకు తో పాటు మొదటి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే సాధించారు. అలాగే మొదటి 10 ర్యాంకుల్లో 6 ర్యాంకులు అమ్మాయిలవే.
1వ ర్యాంకు ఇషితా కిషోర్
2వ ర్యాంకు గరిమా లోహియా
3వ ర్యాంకు ఉమా హారతి ఎన్
4వ ర్యాంకు స్మృతి మిశ్రా
6వ ర్యాంకు గహానా నవ్యా జేమ్స్
9వ ర్యాంకు కనికా గోయల్
ఇషితా కిషోర్:
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 లో మొదటి ర్యాంకు సాధించారు. ఆమె పొలిటికల్ సైన్స్, అంతర్జాతీయ సంబంధాలను ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా తీసుకున్నారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎకనామిక్స్(ఆనర్స్) లో పట్టభద్రురాలు అయ్యారు.
గరిమా లోహియా:
ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరిమల్ కాలేజీ నుండి కామర్స్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. కామర్స్ అకౌంటెన్సీని ఐచ్ఛిక సబ్జెక్ట్ గా చేసుకుని రెండో ర్యాంకును పొందారు.
ఉమా హారతి ఎన్:
హైదరాబాద్ లోని ఐఐటీ నుండి సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్(బీటెక్) పూర్తి చేశారు. ఆమె ఐచ్ఛిక సబ్జెక్టుగా ఆంత్రోపాలజీలతో మూడో ర్యాంక్ పొందారు.
స్మృతి మిశ్రా:
మిరాండా హౌజ్ కాలేజీ, ఢిల్లీ వర్సిటీ నుండి గ్రాడ్యుటేస్(బీఎస్సీ) పూర్తి చేశారు. జంతుశాస్త్రాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకుని నాల్గవ ర్యాంకు సాధించారు.
సత్తాచాటిన తెలుగు విద్యార్థులు:
తెలుగు రాష్ట్రాలకు చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకు సాధించారు. శాఖమూర్తి శ్రీసాయి అర్షిత్ 40వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94 ర్యాంకు, అనుగు శివమారుతీ రెడ్డి 132వ ర్యాంకు సాధించారు. రాళ్లపల్లి వసంతకుమార్ 157, కమతం మహేష్ కుమార్ 200 ర్యాకు సాధించారు.



Click it and Unblock the Notifications