Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఇలా అస్సలే చేయొద్దు.. అరిష్టం - డబ్బంతా మంచి నీళ్లలా ఖర్చు అయిపోతుంది
ప్రతి ఒక్కరి జీవితంలో సంపద, ఆరోగ్యం అత్యంత కీలకమైనవి. సౌకర్యంగా, ఏ లోటు లేకుండా జీవించడానికి సరిపడా డబ్బు ఉండాల్సిందే. అలాగే ఆరోగ్యం లేకపోతే.. ఏది ఉన్నా లేనట్టే. అందుకే ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్యం, సంపద చాలా ముఖ్యమైనవి అని చెబుతారు పెద్దలు. ఆరోగ్యం కాపాడుకోవడానికి పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. సరైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
కానీ తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది.

వాస్తు ప్రకారం ఎలాంటి అలవాట్లు ఒకరి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయో.. ఒక వ్యక్తిని పేదవాడిని చేస్తాయో.. వాటిని ఎలా జరగకుండా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సూర్యోదయం తర్వాత నిద్రలేవడం
రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. వాస్తు ప్రకారం సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. బారెడు పొద్దెక్కాక నిద్ర లేవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని వాస్తు శాస్త్రం చెబుోంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి, సంపద పొందడానికి రోజూ ఉదయం సూర్యోదయానికి ముందు నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
2. నీటిని వృథా చేయడం
మనిషి మనుగడకు నీరు చాలా అవసరం. నీటిని వీలైనంత వరకు ఆదా చేసేందుకే ప్రయత్నించాలి. శాస్త్రాల ప్రకారం నీటి వృథా పాపం కిందే లెక్క. కుళాయి నుంచి నీరు లీక్ అవుతుంటే వీలైనంత త్వరగా రిపేర్ చేయించాలి. అది శుభంగా పరిగణించబడుతుంది.
3. పరిశుభ్రంగా ఉండటం
సంపదకు, శ్రేయస్సుకు అధిపతి అయిన లక్ష్మీదేవి శుభ్రమైన ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడుతుంది. స్వచ్ఛమైన, ఎప్పుడూ క్లీన్ గా ఉండే ఇంట్లోనే లక్ష్మీ దేవి కొలువుదీరుతుంది. అందుకే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోవద్దు.
4. గురువారాల్లో గోళ్లు, జుట్టు కత్తిరించుకోవడం
వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం, ఏకాదశి రోజుల్లో గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
5. సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులు ఇవ్వడం
మత సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని రకాల వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. పాలు, పెరుగు, డబ్బును ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకూడదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications