Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఈ రాశుల వారిని ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుందో తెలుసా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశుల వారికి ఎప్పుడు అదృష్టం వరించనుంది. ఏ రాశుల వారికి ఏ వయస్సులో అద్భుతంగా సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పట్టిందల్లా బంగారం కావాలని, తలపెట్టిన పనిలో విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అదేమంతా సులభం కాదు. కొందరు ఏది పట్టినా నెగటివ్ ఫలితమే వస్తుంది, మరికొందరు తలపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది. మరికొన్ని రాశుల వారు మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొందరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు, మరికొందరు ఆపసోపాలు పడుతూ ఉన్న స్థాయిలోనే ఉంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశుల వారికి ఎప్పుడు అదృష్టం వరించనుంది. ఏ రాశుల వారికి ఏ వయస్సులో అద్భుతంగా సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి వారు పుట్టినప్పటి నుండి అదృష్టవంతులు కాలేరు. 16 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఆపసోపాలు పడాల్సిందే. 16 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మాత్రమే అదృష్టం కలిసి వస్తుంది. గ్రహ స్థితుల వల్ల 16వ ఏటా అదృష్టం కలిసి రాకపోతే 22, 28, 32, 36 సంవత్సరాల్లో అదృష్టం కలిసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వృషభం
వృషభ రాశి వారికి 25 సంవత్సరాల వయస్సులో అదృష్టం కలిసి వస్తుంది. అప్పుడు అదృష్టం తలుపు తట్టకపోతే 28, 36, 42వ ఏటా లక్ కలిసి వస్తుంది.

మిథున రాశి
మిథున రాశి వారికి 22 సంవత్సరాల వయస్సులో అదృష్టవంతులు అవుతారు. 42 ఏళ్ల గరిష్ఠ వయస్సులో అదృష్టం ప్రకాశిస్తుంది. లేకపోతే 32, 33, 36 ఏళ్ల వయస్సులో లక్ వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి 16వ ఏట అదృష్టం ప్రకాశిస్తుంది. బహుశా 16వ సంవత్సరంలో అదృష్టం రాకపోతే, 22, 25, 32, 33, 35, 36వ సంవత్సరాల్లో అనుకూలంగా ఉంటుంది. జీవితంలో పెద్ద మార్పు వస్తుంది.

సింహ రాశి
సింహ రాశి వారికి 16వ ఏట అదృష్టం కలిసి వస్తుంది. 22, 24, 26, 28 సంవత్సరాల వయస్సులో సింహ రాశి వారి అదృష్టం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఈ వయస్సులో సింహ రాశి వారు తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని శాస్త్రం చెబుతోంది.

కన్య రాశి
కన్య రాశి వారికి అదృష్టం 16 సంవత్సరాల వయస్సులో వస్తుంది. బహుశా 16వ ఏట అదృష్టం కలిసి రాకపోతే.. 22, 25, 32, 35, 36 సంవత్సరాల వయస్సులో అనుకూలంగా ఉంటుంది. జీవితంలో పెద్ద మార్పు వస్తుంది.

తులా రాశి
తులా రాశి వారికి అదృష్టం కాస్త ఆలస్యంగా వస్తుంది. 24వ సంవత్సరం లక్ వస్తుంది. 25, 32, 33, 35వ సంవత్సరాలు కూడా అనుకూలంగా ఉంటాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా అదృష్టం ఆలస్యంగానే వస్తుంది. వీరిలో చాలా మందికి 22 సంవత్సరాలు వయస్సులో అదృష్టం ఉండకపోవచ్చు. 24 తర్వాత వారికి లక్ కలిసి వస్తుంది. 28, 32 ఏళ్ల వయస్సులో అదృష్టం కలిసివచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు 16 ఏళ్లకే అదృష్టవంతులు అవుతారు. ఆ తర్వాత 22, 32 సంవత్సరాల్లో అదృష్టాన్ని చూస్తారు.

మకరరాశి
మకరరాశి వారికి బాల్యం నుండి ఎన్ని కష్టాలు వచ్చినా 25 ఏళ్లకే అదృష్టం కలిసి వస్తుంది. ఆతర్వాత33, 35, 36వ సంవత్సరాల్లో జీవితంలో పురోగతికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

కుంభరాశి
కుంభ రాశి వారికి అదృష్టం ఆలస్యంగా వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రాకరం ఈ రాశుల వారికి 25 సంవత్సరాల వయస్సులో అదృష్టం ప్రకాశిస్తుంది. ఆ తర్వాత 28, 36, 42 ఏళ్ల వయస్సులో అదృష్టం బాగా ప్రకాశించే అవకాశం ఉంది.

మీనరాశి
చిన్న వయస్సులో అంటే 16 సంవత్సరాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత 22, 28, 33 ఏళ్ల వయస్సులో లక్ కలిసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.



Click it and Unblock the Notifications