Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల ఊయలతో జాగ్రత్తలు!

1. ఊయల అమర్చే ముందు దానిపైగల తయారీదారుల సూచనలు చదవండి. దానిని మీరు బిగించవద్దు. నిపుణుడైన పనివారిని పిలిచి బిగించండి. అయితే, అదనంగా మీరు దాని నట్టులు, బోల్టులు వున్నాయో లేదో జాగ్రత్తగా పర్యవేక్షించండి.
2. చెక్క ఊయల కొంటే, దానికి బీటలు, మేకులు లేవని నిర్ధారించుకోండి. పెయింట్ బాగుందని నిర్ధారించుకోండి.
3. ఊయలకుగల కోళ్ళ మధ్య దూరం 6 సెంటీమీటర్లకంటే ఎక్కువ వుండరాదు. ఎక్కువ వుంటే బేబీ తల వాటిలో ఇరుక్కునే ప్రమాదం వుంది.
4. ఊయలలో వేసే మేట్రస్ ఎక్కువ మెత్తగా వుండరాదు. మెత్తదనం అధికమైతే బేబీ అసౌకర్యం భావిస్తుంది. లేదా జారిపోవటానికి అవకాశం వుంది. బేబీకి అధికంగా దీనివలననే ప్రమాదాలు జరుగుతాయి.
5.ఇంటిలో వున్న పాత ఊయలలు వీలైనంతవరకు బేబీలకు ఉపయోగించవద్దు. బహుశ వాటిని సీసంతో తయారు చేస్తే బేబీకి హాని కలుగవచ్చు.
6. ఊయలకు రెండు లేదా మూడు అదనపు హుక్ లను సైడ్ రెయిల్స్ కు వుండేలా చూడాలి. ఒకటే వుంటే బేబీ కొంచెం పెద్దదైందంటే చాలు తీయటానికి ప్రయత్నిస్తుంది.
7. ఊయలలో పక్కల మందపాటి బట్ట లేదా చిన్నసైజు దిండు వంటివి పెడితే బేబీ కదిలినపుడు పెద్దగా ప్రమాదం లేకుండా వుంటుంది.
8. ఆడుతుంది కదా అని ఊయలలో బొమ్మలు ఎక్కువ పెట్టకండి. బేబీ గాలి ఆడక ఇబ్బంది పడుతుంది.
కాబోయే తల్లితండ్రులు బేబీ ఊయలపై ఈ రకం జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications