Latest Updates
-
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా..
ఊయలతో మీ బిడ్డ భద్రం!

1. ఊయల అమర్చే ముందు దానిపైగల తయారీదారుల సూచనలు చదవండి. దానిని మీరు బిగించవద్దు. నిపుణుడైన పనివారిని పిలిచి బిగించండి. అయితే, అదనంగా మీరు దాని నట్టులు, బోల్టులు వున్నాయో లేదో జాగ్రత్తగా పర్యవేక్షించండి.
2. చెక్క ఊయల కొటే, దానికి బీటలు, మేకులు లేవని నిర్ధారించుకోండి. పెయింట్ బాగుందని నిర్ధారించుకోండి. ఊయల వేసేటపుడు దాని రింగులు గట్టిగా వున్నాయా లేదా చెక్ చేయండి.
3. ఊయలకుగల కోళ్ళ మధ్య దూరం 6 సెంటీమీటర్లకంటే ఎక్కువ వుండరాదు. ఎక్కువ వుంటే బేబీ తల వాటిలో ఇరుక్కునే ప్రమాదం వుంది. ఈ అంశం ఊయల కొనే ముందే పరిశీలించాలి. లేదా బేబీకి పక్కన పిల్లో పెట్టాలి.
4. ఊయలలో వేసే మేట్రస్ ఎక్కువ మెత్తగా వుండరాదు. మెత్తదనం అధికమైతే బేబీ అసౌకర్యం భావిస్తుంది. లేదా జారిపోవటానికి అవకాశం వుంది. బేబీకి అధికంగా దీనివలననే ప్రమాదాలు జరుగుతాయి.
5.ఇంటిలో వున్న పాత ఊయలలు వీలైనంతవరకు బేబీలకు ఉపయోగించవద్దు. బహుశ వాటిని సీసంతో తయారు చేస్తే బేబీకి హాని కలుగవచ్చు.
6. ఊయలకు రెండు లేదా మూడు అదనపు హుక్ లను సైడ్ రెయిల్స్ కు వుండేలా చూడాలి. ఒకటే వుంటే బేబీ కొంచెం పెద్దదైందంటే చాలు తీయటానికి ప్రయత్నిస్తుంది.
7. ఊయలలో పక్కల మందపాటి బట్ట లేదా చిన్నసైజు దిండు వంటివి పెడితే బేబీ కదిలినపుడు పెద్దగా ప్రమాదం లేకుండా వుంటుంది. అలాగని బేబీకి మరీ గాలి ఆడకుండా పెద్ద పిల్లోలు పెట్టకండి.
8. ఆడుతుంది కదా అని ఊయలలో బొమ్మలు ఎక్కువ పెట్టకండి. బేబీ గాలి ఆడక ఇబ్బంది పడుతుంది. వేలాడే బొమ్మలు కొన్ని బేబీ ఊయలకు పైన కడితే ఎంతో బాగుంటుంది. అవి రంగురంగుల బొమ్మలై వుండాలి.
కాబోయే తల్లితండ్రులు బేబీ ఊయలపై ఈ రకం జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు, బేబీ ఊయలలో ఉన్నపుడు తల్లి లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎల్లపుడూ గమనిస్తూ ఉండాలి. కొద్దిపాటి పిల్లలైతే, నిద్ర లేచిన తర్వాత ఊయలనుండి దిగటానికి కూడా ప్రయత్నిస్తారు. అటువంటపుడు కూడా బేబీలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు బేబీకి బాగా ఊహ తెలిసేటంతవరకు లేదా ఊయల బేబీ మానేసేటంతవరకు తీసుకుంటూ ఉండాలి.



Click it and Unblock the Notifications