Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొత్తగా పుట్టిన శిశువులు బరువు ఎందుకు తగ్గుతారు?

మీ బేబీ ఎంత బరువు కోల్పోతుంది?
పుట్టిన 48 గంటల లోపుగా బేబీ తన బరువులో 5 నుండి 7 శాతం వరకు బరువు తగ్గుతుంది. తల్లి కనుక అధికంగా నరాల ద్వారా ద్రవాలు ఇవ్వబడినా లేక ఆమెకు నెలలు నిండకుండానే డెలివరీ అయినా, కొత్త గా పుట్టిన బిడ్డ బరువు 10 శాతం వరకు కూడా తగ్గుతుంది. ఇంతకంటే బేబీ బరువు తగ్గితే ఆమె జబ్బుతోనైనా లేక తల్లిపాలు సరిగా అందకైనా అయ్యుండాలి.
అసలు బేబీ బరువు తగ్గటానికి కారణాలేమిటి అనేది తల్లితండ్రులు తెలుసుకోవాలి?
1. కాన్పు సమయంలో ఒత్తిడి - బేబీలు పుట్టినపుడు లావుగా పుట్టినా, కాన్పు సమయంలో వారికి కలిగే ఒత్తిడి, నొప్పి వాటి కారణంగా కొంతమేరకు బరువు కోల్పోయి గట్టిపడతారు.
2. నీటి బరువు - గర్భిణీ స్త్రీ కొంతమేరకు నీటి బరువు కలిగి వుంటుంది. ప్రెగ్నెన్సీలో అనేక హార్మోన్ మార్పుల కారణంగా శరీరంలో నీరు నిలబడిపోతుంది. బేబీ ఉమ్మ నీటిలో తేలియాడటం వలన ఈ అధిక నీరు బేబీ శరీరంలో కూడా ప్రవేశిస్తుంది. ఈ అధిక నీరు బేబీ తల్లి శరీరంనుండి బయటకు రాగానే వెంటనే తగ్గిపోవటం మొదలుపెడుతుంది.
3. తల్లి నరాలకు ద్రవాలు - సాధారణంగా ప్రసవం అవబోయే మహిళకు కాన్పు నొప్పులు తగ్గించేందుకుగాను నరాల ద్వారా కొన్ని ద్రవాలు ఇస్తారు. ఈ రకమైన అధిక ద్రవాలు కూడా పుట్టబోయే బిడ్డ శరీరానికి చేరి అధిక బరువు కలిగిస్తాయి.
4. రిజర్వు కొవ్వులు - కొత్తగా పుట్టిన శిశువుకు కనీసం 3 రోజులపాటు అవసరమైన రిజర్వు కొవ్వులు శరీరంలో వుంటాయి. దానికి కారణం మొదటి మూడు రోజులలో తల్లి పాలలో అవసరమైన పోషక కొవ్వులు వుండవు. బిడ్డను ప్రసవించిన వెంటనే తల్లి ముర్రుపాలు అనబడే పసుపు పచ్చని ద్రవాన్ని తన స్తనాలలో కలిగి వుంటుంది. ఈ ద్రవం బిడ్డకు రోగ నిరోధకత కలిగిస్తుంది. 48 గంటల తర్వాతనే తల్లిపాలలో కొవ్వు చేరటం మొదలుపెడుతుంది. అంతవరకు బేబీ తనలోని కొవ్వులను తన శరీరానికి వాడుకుంటుంది.
5. సరైన ఆహారం ఇవ్వకపోవటం - బేబీ కనుక తెలిపిన దానికంటే అధిక బరువు కోల్పోతూంటే, మీరు బేబీకి సరైన రీతిలో ఆహారాన్ని అందించటంలేదని కూడా భావించాలి. పాలు తీసుకునే సమయంలో బేబీలు అధిక గాలిని లోపలికి తీసుకుంటారు. ఇది వారి కడుపును వేగంగా నింపి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. బిడ్డకు తల్లిపాలు పట్టటంలో గతంలో అనుభవం వున్న వారి సలహాలను పాటించాలి. ఆహార సమయంలో బిడ్డ నిద్రిస్తుంటే లేపి పాలు పట్టాలి.
కొత్తగా పుట్టిన బేబీ తప్పక బరువు తగ్గుతుంది. అయితే అది కొంతమేరకు మాత్రమే. కొత్తగా పుట్టిన బేబీలు బరువు తగ్గటంలో మీకు గల అనుభవాలను మాకు వ్రాయండి.



Click it and Unblock the Notifications