Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
గర్భం ధరించే అవకాశాలు తగ్గితే?

బరువు నియంత్రణ - బరువు అధికంగా వుండటమే కాదు బరువు తక్కువున్నా గర్భం ధరించే అవకాశాలు సరిగా వుండవు. 18.5 నుండి 24.9 వరకు గల బాడీ మాస్ ఇండెక్స్ గర్భం ధరించాలంటే సాధారణంగా చెపుతారు. అంతకు మించితే, అధిక బరువుగాను తగ్గితే, బరువు తగక్కువైనట్లు చెపుతారు.
ఆహారపుటలవాట్లు - మీ ఆహారం తినే అలవాట్లను పరిశీలించండి. కూల్ డ్రింక్ వంటి పానీయాలు తక్కువగా తాగాలి. మీరు తినే ఆహారంలోని పోషక విలువలు మీ గర్భ ధారణ అవకాశాలను సహజంగా అధికం చేస్తాయి. కేఫైన్ వుండే పానీయాలు కూడా తాగరాదు. రోజుకు 5 కప్పుల కాఫీ సుమారుగా 500 మి.గ్రా.ల కేఫైన్ రక్తంలో కలుపుతుంది. అది గర్భధారణ ఆలస్యం చేస్తుంది. కనుక కాఫీ మితంగా తాగాలి. ఆల్కహాలు తాగే మహిళలు గర్భం ధరించాలంటే, మితంగా తాగాలి. అధికంగా తాగితే, అది మహిళకే కాక పుట్టబోయే బిడ్డకు కూడా హాని కలిగిస్తుంది.
వ్యాయామం - ప్రతిరోజు కొద్దిపాటి వ్యాయామం చేసి ఒత్తిడి ని తగ్గించుకొని హార్మోన్ల అసమతుల్యత లేకుండా చూసుకుంటే త్వరగా తల్లి అయ్యే అవకాశాలుంటాయి. యోగా, ధ్యానం వంటివి మనస్సును ప్రశాంతంగా వుంచి మహిళలు గర్భం ధరించేందుకు తోడ్పడతాయి.
పురుషులకు చిట్కాలు-
వీర్యాన్ని వీర్యం ఉత్పత్తి చేసే అవయవాలను బలంగా ఆరోగ్యంగా వుంచండి. రక్తనాళాలను అధిక ఉష్ణోగ్రతకు గురిచేస్తే ఫలదీకరణ అవకాశాలు తక్కువ. వేడెక్కిన కారు సీట్లు, ల్యాపుటాప్ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వంటివి తొడలపై పెట్టి వాడితే వాటి ప్రభావం వీర్య ఉత్పత్తిపై కనపడుతుంది. కనుక పురుషులు వీటి వినియోగంలో జాగ్రత్తగా వుండాలి. పరిశ్రమలలో పని చేసేవారు వేడికి అధికంగా ఎక్స్పోజ్ కారాదు. బిగువుగా వుండే దుస్తులు ధరించడం వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుంది. తరచుగా వేడినీటి టబ్ స్నానం చేయకండి. వీర్యకణాల సైజు, ఆకారం, వాటి కదలికలు నాణ్యతను బట్టి వుంటాయి. వీర్యకణాలు నాణ్యతకలిగి వుండాలంటే తినే పదార్ధాలు సైతం ఆరోగ్యకరమైనవై వుండాలి.
పొగతాగే పురుషులకు సిగరెట్లలోని నికోటైన్ శరీరంలో విష సమానమైన పదార్ధాలను కలిగించి వీర్యకణాల సంఖ్యను వాటి జన్యువులను నష్టపరుస్తుంది. పొగతాగే మహిళలైతే, గర్భ విచ్ఛిన్నాలకు అధిక అవకాశాలుంటాయి. కనుక ఈ అలవాట్లు గర్భం ధరించాలనుకునేవారు పూర్తిగా వదలివేయటం మంచిది.



Click it and Unblock the Notifications
