Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పిల్లల జ్వరాలు పోగొట్టేందుకు సులువైన మార్గం!

శరీర ఉష్ణోగ్రత సాధారణ స్ధాయికి మించి అధికం అయితే జ్వరంగా పరిగణించవచ్చు. సాధారణ స్ధితి అంటే...91.8 నుండి 100.8 ఫారెన్ హీట్ డిగ్రీలుగా చెప్పాలి. ఈ రేంజిలో శరీరాన్ని బట్టి ఒక్కోక్కరికి ఒకో రకంగా వుంటుంది. పిల్లవాడి శరీరం 100.8 ఫారెన్ హీట్ డిగ్రీలు దాటితే ఇక శ్రధ్ధ పెట్టి తగ్గించేటందుకు ప్రయత్నం చేయాలి. అయితే, జ్వరం వచ్చిన ప్రతి సారి పిల్లల వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం లేదు. గతంలో ఒక సారి డాక్టర్ రాసిన మందుల చీటి వుంటే, వీలైనంతవరకు దానినే రిపీట్ చేసి పిల్లవాడి జ్వరాన్ని తగ్గించవచ్చు.
1. జ్వర లక్షణాలు గమనించండి. సాధారణ మలం రాకపోవటం, ఆకలి మందగించటం, పిల్లవాడు డల్ గా అదోరకంగా వుండటం ఇక జ్వరం వచ్చేస్తుందన్న సూచనలనిస్తాయి.
2. సాధారణంగా, పిల్లవాడి చేతులు, కాళ్ళు జ్వరం వచ్చనపుడు కొంచెం వేడెక్కుతాయి. నోటిలో, లేదా గుదములో లేదా చంకలో ధెర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూడండి.
3. టెంపరేచర్ కనుక 101 డిగ్రీలకంటే ఎక్కువగా వుంటే జాగ్రత్త వహించండి.
4. మొదట, పిల్లవాడి శరీరంపై వున్న అధికమైన బట్టలు తొలగించండి. తేలికగా వుండే దుస్తులు వేయండి. పిల్లాడు పడుకున్న ప్రదేశం చక్కటి గాలి వచ్చేదిగా చూడండి. సాధారణంగా ఇచ్చే పారాసిటమాల్ వంటి మందులు వాడండి.
5. టెంపరేచర్ అధికంగా వుంటే, ముందు దానిని తగ్గించేటందుకు, కొద్దిపాటి వేడిగల నీటిలో ముంచిన షర్టును బాగా పిండి పిల్లాడు కొద్ది నిమిషాలు దానిని ధరించేలా చేయండి. దీనితో టెంపరేచర్ తగ్గుముఖం పడుతుంది. టెంపరేచర్ తగ్గితే, వదులైన షర్టు వేసి రెగ్యులర్ మందులు వాడండి.
6. రెగ్యులర్గా టెంపరేచర్ చూడటం, నాలుగు లేదా ఆరు గంటల కొకసారి మందులు వేయటం చేయాలి. అయితే 24 గంటలలో అయిదు డోసులకు మించి వేయకండి.
7. పిల్లవాడికి ఆహారంగా సూప్ లేదా మెత్తని ఆహారం ఇవ్వండి. ఇంట్లో చేసిన ఇడ్లీ, సూపులు, రైస్ లాంటి తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలు ఇవ్వండి.
8. త్వరగా జ్వరం తగ్గాలంటే, ముద్దు చేయండి. కధలు వినిపించండి. ఆటలు ఆడించి ప్రేమ చూపండి.
మెడిసిన్ వేసినా టెంపరేచర్ తగ్గకపోతే, వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.



Click it and Unblock the Notifications