Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అధిక ఉప్పు పిల్లలకు హాని కలిగిస్తుందా?
ప్రతి తల్లి కూడా తన బిడ్డ ఆహారంలో అన్నిరకాల పోషకాలు ఉన్నాయా లేదా అనేది చూస్తుంది. మరి అటువంటపుడు తగిన సోడియం కూడా మీ బిడ్డ ఆహారంలో ఉండాలి. శరీరంలో ద్రవాల బ్యాలన్స్ సరిగా ఉండాలంటే, నరాల వ్యవస్ధ బాగా పనిచేయాలంటే, కండరాలు సంకోచ వ్యాకోచాలు సరిగా చేయాలంటే, తినే ఆహారంలో తగినంత ఉప్పు ఉండాలి. మరి సోడియం లోని ఆరోగ్య ప్రయోజనాలు సరిగా అందాలంటే, మీ బిడ్డ ఆహారంలో తగినంత మేరకే ఉప్పు ఉండాలి.

ఎంత ఉప్పు మంచిది? ట్రేడింగ్ స్టాండర్డ్ ఇన్ స్టిట్యూట్ వారు నిర్వహించిన సర్వే మేరకు ఒక సంవత్సరంలోపు పిల్లలకు ప్రతిరోజూ 1 గ్రాము ఉప్పు తింటే సరిపోతుంది. 1 నుండి 3 సంవత్సరాల వయసు వారికి ప్రతిరోజూ 2 గ్రాముల ఉప్పు కావాలి, 4 నుండి 6 సంవత్సరాల వయసు వారికి రోజుకు 3 గ్రాముల ఉప్పు కావాలి. 7 నుండి 10 సంవత్సరాల పిల్లలకు రోజుకు 5 గ్రాములు వరకు సరిపోతుంది.
అయితే, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి. మనం తీసుకునే ఆహారాలలో అంటే, పాలు, మాంసం, లేదా కూరగాయలు వంటి వాటిలో సహజ సోడియం లభిస్తుంది. కనుక మీ బిడ్డ కనుక పైవాటిలో ఏది తీసుకుంటున్నప్పటికి మీరు ఉప్పును ప్రత్యేకంగా ఆహారంలో వేయకండి. వాటిలో ఉండే ఉప్పు అతనికి సరిపోతుంది. లేదంటే, మీరు అదనంగా వేసే ఉప్పు బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
ఈ హాని ఎలా ఉంటుంది? పిల్లలకు అధిక ఉప్పు నష్టం కలిగిస్తుంది. వారిలో వివిధ రకాల వ్యాధులు వస్తాయి. మన శరీరంలో కిడ్నీలు కనుక సరిగా పనిచేయకపోతే, సోడియంను బ్యాలన్స్ చేయటంలో విఫలం అయితే, దాని భారం వెంటనే మీ శరీరంలోని రక్తనాళాలపై పడుతుంది. ఒత్తిడి అధికం అవుతుంది. కిడ్నీ సమస్యలు వస్తాయి. ఇపుడు పిల్లలు తినే అధిక ఉప్పు ఆహారాలు వారి తర్వాతి జీవితంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఉప్పు అధికమైనందున పిల్లలలో ఆస్తమా, కిడ్నీ రాళ్ళు వంటి వ్యాధులు వస్తాయని స్టడీలు చెపుతున్నాయి. అంతేకాదు, పిల్లలలో ఊబకాయం వచ్చేస్తుంది. కనుక మీ బిడ్డ ఆహారంలో ఉప్పును నియంత్రించి అతడిని సోడియం అధికమైతే కలిగే నష్టాలనుండి కాపాడండి.
తగినంత ఉప్పు అంటే...మీ బిడ్డ కిడ్నీ అధిక ఉప్పు తీసుకోలేదు. కనుక ఒక సంవత్సరం వరకు బిడ్డ ఆహారంలో ఉప్పు వేయకండి. అతను తాగే తల్లిపాలలో ఉండే ఉప్పు శరీరానికి సరిపోతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే, సాస్, గ్రేవీ, కర కరలు వంటివి సోడియం కలిగి ఉంటాయి. కనుక మీ బిడ్డ ఆహారం మంచి గింజలు, కూరలు, పండ్లతో నింపండి. వాటిలో సోడియం తగినంత మాత్రమే ఉంటుంది.
మీ బిడ్డ ఎదుగుదలకు తగినంత సోడియం మాత్రమే మంచిది. అది ఏ మాత్రం సరిగా నియంత్రణ చేయకున్నా హాని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications