Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రేమకు హద్దులు...పెడితే ముద్దులు!

మీ బిడ్డ పెరిగి పెద్దవాడైతే, విషయాలను అర్ధం చేసుకోగల స్ధితి వచ్చినప్పటికి, మీరు మీ ప్రేమను అధికంగా చూపుతూ ఉంటే, అది బలహీన పడుతుంది. వారు దానిని తమకు లాభసాటిగా చేసుకొని దుర్వినియోగం చేస్తారు. ఇక మిమ్మల్ని మాయ చేసి ఏదో ఒకరకంగా చెడు అలవాట్లకు లోనవుతారు. కనుక మీ బిడ్డ పై వయసుకు తగ్గ రీతిలో ప్రేమను చూపండి. అంటే ప్రేమను చూపరాదని కాదు. ఆ ప్రేమ క్రమశిక్షణకు అడ్డంకి కారాదు.
పిల్లలందరూ కూడా తమ తల్లితండ్రుల ప్రేమను కొంతమేరకు తమకు లాభసాటిగా వాడుకుంటారు. అది అధికమైతే వారికి మంచిది కాదు. వారు తప్పుడు దోవలు తొక్కే అవకాశం ఉంది. కనుక మీ పెంపకం అటువంటివి జరుగకుండా ఉండేలా బలంగా ఉండాలి. అటువంటపుడు మీ ప్రేమ తగ్గుతుందని వారికి తెలుపండి. వారు సరైన మార్గంలోకి రావటానికి మీరు కఠినంగా ఉంటామని తెలుపండి.
వారి స్వేచ్ఛను లిమిట్ చేయండి. తమ బిడ్డలగురించి ఎవరైనా జాగ్రత్త పడుతూనే ఉంటారు. కాని అపరిమిత స్వేచ్ఛ ఇవ్వరాదు. మీరు అలా చేస్తే అది చెడుకు దోవతీస్తుంది. మీ బిడ్డ చెడు స్నేహాలలో ఎపుడు పడతాడో, ఎపుడు చెడతాడో తెలియదు. సరైన పెంపకం అంటే అతనను ప్రపంచంలో ఎలా ప్రవర్తించాలనేది మాత్రమే. కనుక మీ ప్రేమను లిమిట్ చేయండి. అదే సమయంలో వారికి స్వేచ్ఛను కూడా ఇవ్వండి. కాని దానిని లిమిట్ చేయాలి. అపుడే వారు వారి పరిధులు తెలుసుకుంటారు.
అతి అనేది ఎప్పటికి మంచిది కాదు - మీ ప్రేమను లిమిట్ చేయండి. అలాగని వారు అలసి జబ్బు పడేంతవరకు అది పోరాదు. బిడ్డ పట్ల జాగ్రత్త అవసరం. అతను ఏ రకమైన దశలో ఉన్నాడనేది తెలుసుకోండి. అతడు చెడు మార్గం లో ఉన్నాడా, మంచి మార్గంలో ఉన్నాడా గ్రహించండి. వారి కోరికలు తీర్చండి. అతిగా చేసే క్రమ శిక్షణ కూడా హాని కలిగిస్తుంది. అతనికి మీరు పేరెంట్ గాను ఒక స్నేహితుడుగాను ఉండాలి. ఈ రకమైన మీ తీరు పెంపకంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది.
మీ బిడ్డ పెంపకంలో ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. అతని బాగోగులకు భాధ్యత వహించండి.



Click it and Unblock the Notifications