Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల్లో మలబద్దక నివారణకు బెస్ట్ హోం రెమెడీస్
మలబద్దకం అనేది సాధారణంగా పెద్దవారిలోనే చూస్తుంటా. కానీ పిల్లల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. చిన్న పిల్లల్లో ఈ సమస్య చాలా బాధాకరమైన మరియు భయంకరమైన అనుభవంగా ఉంటుంది. మలబద్దకానికి అనేక కారణాలు ఉండవచ్చు. పిల్లల్లో న్యూట్రిషియన్ లోఫం, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, అక్రమ టాయిలెట్ శిక్షణ తదితర అనేక కారణాల వల్ల కలగవచ్చు. అయితే, మలబద్దకానికి మరో అత్యంత సాధారణ కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడం.పిల్లలు తరచూ నీరుత్రాగడాన్ని గుర్తుంచుకోరు. దాంతో ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది.
పిల్లల్లో కూడా డైట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ పిల్లలు ప్రొసెస్ చేసిన మరియు స్టిక్కీ ఆహాయాలను తినడానికి ఇష్టపడుతుంటే,వాటిలో ఫైబర్ మరియు నీటి శాతం సమృద్ధిగా ఉండవు. దాంతో వారు మలబద్దకం సమస్యకు దారితీస్తుంది. పిల్లలు మలబద్దకం సమస్యతో బాధపడుతన్నప్పుడు తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదు. వారికి సరైన ఆహారం అధివ్వండి. ఫర్ ఫెక్ట్ కిడ్స్ డైట్ అనుసరించడం వల్ల అది ఒక బెస్ట్ హోం రెమడీగా మలబద్దకాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు పాలలో 1 లేదా 2టేబుల్ స్పూన్ల తేనె లేదా పంచదార వేసి మిక్స్ చేసి ఇవ్వడం ఒక బెస్ట్ హోం రెమెడీ. పిల్లల్లో మలబద్దకాన్ని నివారించడానికి మరికొన్ని ఇంటి చిట్కాలు...

తేనె మరియు పంచదార:
ఒక గ్లాసు పాలలో 1-2టేబుల్ స్పూన్ తేనె మరియు పంచదార వేసి బాగా మిక్స్ చేసి, పరకడుపున త్రాగించాలి .

ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు:
కూరగాయల్లో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది . ఇది పిల్లల్లో మలబద్దకాన్ని నివారిస్తుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఫైబర్ మరియు వాటర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, క్యారెట్, టర్నిప్స్, క్యాబేజ్, బీట్స్, గుమ్మడి, ఆకుకూరలు మరియు ఫ్రెంచ్ బీన్స్ వంటివి మీ కిడ్స్ డైట్ లో చేర్చండి.

ఫ్లాక్ సీడ్స్:
పిల్లకలు అంధించే ఒక బెస్ట్ ఫుడ్ మరియు మలబద్ధకాన్ని నివారించే ఉత్తమ హోం రెమెడీ. నీళ్ళలో ఫ్లాక్స్ సీడ్స్ వేసి, బాగా ఉడికించాలి. ఆనీటిని వడగట్టి, బాగా చల్లార్చి పిల్లలకు త్రాగించాలి.

ఆముదం:
ఒక గ్లాసు పాలలో అర చెంచా ఆముదం మిక్స్ చేసి పిల్లలకు త్రాగించవచ్చు. ఇది ఒక ఉత్తమ హోం రెడీ. ఇది మలబద్దకానికి నివారణిగా అద్భుతంగా సహాయపడుతుంది.

నీళ్ళు:
శరీరంలో నీటిశాతం కోల్పోవడం వల్ల మలబద్దకం తీవ్రమవుతుంది. ప్రేగు అనుగుంగా మారి తేలికగా విసర్జిండానికి, తగినంత నీళ్ళు పిల్లల దగ్గర త్రాగించాలి.

అరటి పండు:
మలబద్దకాన్ని నివారించడంలో ఇది ఒక ఉత్తమ పండు. ఒక గ్లాసు వేడి పాలతో పాటు ఒక అరటి పండును పిల్లల చేత తినిపించండి.

అజ్వైన్:
ఈ అజ్వైన్ విత్తనాలు మరియు పంచదారను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి పిల్లలచేత త్రాగించాలి.



Click it and Unblock the Notifications