Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీలు ఇలాగే పడుకోవాలి, రెండింతల ఆహారం తినాలి.. అపోహలా? నిజాలా?
తల్లికావడం ఏ మహిళకైన అత్యంత మధురమైన అనుభూతి. గర్భం దాల్చడం అనేది ప్రత్యేకమైనది. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అపురూపమైన ఆ సమయాన్ని ఆస్వాదించాలి. అయితే గర్భాధారణ వేళ కొన్ని జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గర్భం ధరించిన సమయం నుంచి చాలా మంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. గర్భం ధరించిన వారు ఆ పనులు చేయవద్దని, ఈ పనులు చేయవద్దని అంటారు. ఒకే వైపు తిరిగి పడుకోవాలని చెబుతుంటారు. మరి వారు చెప్పేవి నిజాలేనా, లేదా అపోహలా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీలు అలాగే పడుకోవాలి!
నిద్రపోయేటప్పుడు ఒకే వైపుకు తిరిగి పడుకోవాలంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. అటు ఇటు తోచిన వైపుకు కదులుతూ ఉంటే సౌకర్యవంతమైన స్థానాన్ని గుర్తించి పడుకుంటాం. అయితే కొందరు మాత్రం గర్భిణీలు ఒకే వైపుకు తిరిగి పడుకోవాలని చెబుతుంటారు. ఎడమవైపుకు తిరిగి పడుకుంటే మంచిదంటారు. అయితే ఇలా పడుకోవడం వల్ల గర్భిణీలు ఆరోగ్యం మెరుగుపడినట్లు ఏ అధ్యయనంలోనూ తేలలేదు.

గర్భిణీల ముఖం కళగా కనిపిస్తుంది!
గర్భం ధరించిన స్త్రీల ముఖం కాస్త ప్రకాశవంతంగా కనిపించడం చాలా మంది గమనించే ఉంటారు. గర్భిణీల ముఖం కళగా కనిపిస్తుంది అనడం అపోహ కాదు. గర్భధారణ వేళ చర్మం సాగుతుంది. దీని వల్ల ముఖంపై ముడతలు కనిపించవు. అలాగే రక్తప్రసరణ పెరిగి ముఖం కాంతివంతంగా అవుతుంది.
గర్భిణీలు జుట్టుకు రంగు వేసుకోవద్దు!
హెయిర్ డైలో ఉండే రసాయనాలు, ట్యాక్సిన్లు పుట్టబోయే బిడ్డకు హానికరం. జుట్టుకు డైయింగ్ చేయడం వల్ల రసాయనాలు పీల్చుకునే ప్రమాదం ఉంటుంది. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో డై వేసుకుంటే సమస్యేం ఉండదు.
గర్భిణీలు టాటూలు వేసుకోవద్దు!
గర్భిణీలు పచ్చబొట్లు, టాటూలు వేయించుకోవద్దని చాలా మంది అంటారు. గర్భాధారణ సమయంలో స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు. శరీరం వివిధ మార్పులకు లోనవుతుంది. చర్మం కాస్తంతా సాగుతుంది. ఈ సమయంలో టాటూలు వేయించుకుంటే.. ప్రసవం అయ్యాక, చర్మం సాధారణ స్థితికి వచ్చాక టాటూ ఆకారం మారినట్లుగా కనిపిస్తుంది. అలాగే టాటూలు కొంత మందిలో ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు.
పొట్ట ఆకారం బట్టి ఆడ లేదా మగ తెలుసుకోవచ్చు!
ఇందులో ఏమాత్రం నిజం లేదు. నిజంగానే ఇలా తెలిసిపోతే 9 నెలల పాటు ఎగ్జైట్‌మెంట్ అవసరమే లేదు. పొట్ట ఆకారం, తల్లిలో ఆరోగ్య సమస్యలు, వాంతులు ఎక్కువ రావడం, ఎక్కువగా తన్నడం లాంటి లక్షణాలు కనిపిస్తే అమ్మాయి లేదా అబ్బాయి అని అంటుంటారు. కానీ అలా తెలుసుకోవడం సాధ్యం కాదు.
గర్భిణీలు రెండింతల ఆహారం తినాలి!
గర్భిణీలు రెండింతల ఆహారం తినాలంటారు చాలా మంది. గర్భంలో శిశువుకు, తల్లికి సరిపడా రెండింతల అన్నం తినాలని బలవంతం చేస్తుంటారు. అయితే విపరీతంగా తినవద్దని అంటారు వైద్యులు. ప్రెగ్నెన్సీ సమయంలో వైద్యుల సూచన మేరకు, పోషకాహార నిపుణుల సలహా మేరకు ఆహారం తీసుకుంటే తల్లికి, బిడ్డకూ మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications