Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బిడ్డ అవసరాలు తల్లితండ్రులే గ్రహించాలి?

అన్నిటికి ఆందోళన వద్దు - బేబీ ఉమ్మినా, వాంతి చేసినా, ఏడ్చినా రోజంతా ఆందోళన పడకండి. బేబీ ఆరోగ్య సమస్యలకు పిల్లల వైద్యుడిని సంప్రదించండి.
అతిగా ఏడుస్తోందా? - పిల్లలు ఏడుస్తారు. మీరు తప్పు చేసినందువల్లకాదు. బేబీల ఏడుపు సహజమే. నేపీ మార్చండి. ఇంకా అతిగా ఏడుస్తూ వుంటే డాక్టర్ని సంప్రదించండి.
బేబీని పాలు తాగమని నిద్ర లేపుతున్నారా? ఆ పని చేయకండి. బేబీకి ఆకలి వేస్తే లేచి ఏడుస్తుంది. అపుడు పట్టండి. తల్లిపాలు తాగే పిల్లలు రాత్రంతా నిద్రిస్తూనే వుంటారు. ఈ కారణంగా మీ నిద్ర, బేబీనిద్ర పాడు చేసుకోకండి.
బేబీ ఉమ్మటం లేదా వాంతి చేస్తోందా? బేబీలు సాధారణంగా ఉమ్మివేస్తారు. తిన్నది, తాగింది బయటకు తెప్పిస్తోందనుకోకండి. కాని ప్రతి అరగంటకు పాలు బయటకు వచ్చేస్తూంటే మాత్రం వైద్యుని సంప్రదించండి.
నోటి సంరక్షణ - బిడ్డకు దంతాలు లేవని నోరు శుభ్రం చేయటం లేదా? మెత్తటి గుడ్డతో నోరు చిగుళ్ళు శుభ్రం చేయండి.
బిడ్డకు లోపం జరుగుతోందని భాగస్వామితో వాదించకండి. బిడ్డకు అవసరాలు తీర్చటంలో ఇద్దరిది ఉమ్మడి భాద్యత అని గుర్తించండి. ఎవరు ఏది చెపితే దానిని బిడ్డకు ఆచరించకండి. ఒక బేబీకి సరిపడినది మీ బిడ్డకు సరి కాకపోవచ్చు. ఆమెకవసరమైన దానినే అందించండి.
తల్లిపాలు బేబీకి తగినన్ని లభిస్తున్నాయా? అనేది మీకు మీరే గ్రహించండి... తల్లి తన పాలను బిడ్డకు ఇస్తున్నంత కాలం తనకు ఎన్ని పాలు పడుతున్నాయో, బిడ్డ ఎన్ని తాగుతోందో, అసలు సరిపోతున్నాయో లేదో అన్న సందేహాలు వస్తూనే వుంటాయి. కొత్తగా తల్లులైన వారికి ఈ సమస్య సాధారణం. ఇందుకుగాను కొన్ని అంశాలు పరిశీలించండి.
కొన్నివారాల పాటు తల్లి పాలు పట్టేస్తే, ఆమె స్తనాలు 5 లేదా 6 నెలలకల్లా సైజులో చిన్నవి అయిపోతాయి. పాలు ఎండిపోయే పరిస్ధితి వస్తుంది. కాని తగ్గిన బ్రెస్ట్ సైజ్ సాధారణమే. అది మీ బేబీకి అవసరమైన పాలు ఇస్తూనే వుంటుంది. బేబీ పెద్దది అవుతూంటే....గతంలో ఒక్కసారికి అరగంట పట్టేదానికంటే, ఇపుడు 5 లేదా 10 నిమిషాలలో పాలు పట్టటం అయిపోతుంది. దానికి కారణం బిడ్డ వేగంగా తాగడం అలవాటు చేసుకుంటుంది. మీ స్తనాలను వేగంగా ఖాళీ చేస్తుంది.
బేబీ కి పాలు సరిపోతున్నాయో లేదో ఎలా తెలుస్తుంది? 24 గంటల కాలంలో మీ బేబీ 5 నుండి 6 నేపీలు తడిపేస్తుంది. పుట్టినప్పటినుండి 5వ రోజు వరకు మలం నలుపునుండి ఆకుపచ్చకు వస్తుంది తర్వాత ఎల్లో మస్టర్డ్ గా వుండి లూజుగా వుంటుంది. కొద్ది వారాల తర్వాత బేబీ రోజుకోసారి మలం చేయగా తర్వాత వారానికోసారి కూడా మలం చేయవచ్చు. అది సాధారణం. బేబీకి మంచి చర్మ రంగు వుంటుంది. బేబీ రోజులో కొన్ని సార్లు చాలా మెళకువగాను, నిద్రించకుండాను, చికాకుగాను, ఏడుస్తూనూ వుంటుంది. ఇదంతా కూడా బేబీ సాధారణ ప్రవర్తన గానే గుర్తించండి.



Click it and Unblock the Notifications