Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కాన్పు తర్వాత నడుముకు చేసే వ్యాయామాలు!

ప్రెగ్నెన్సీ తర్వాత నడుముకు చేసే వ్యాయామాలు
అసలు నడుములోని ఏ కండరాలు బిగువు సంతరించుకోవాలి? అంటే....మూత్రం వదలండి. మధ్యలో ఆపండి మరల రిలాక్స్ చేయండి. ఈ రకంగా వదలటం, బిగువు చేయటం చేసేటపుడు ఏ కండరాలైతే కదులుతాయో వాటిని తుటి కండరాలు లేదా పెల్విక్ మజిల్స్ అంటారు.
ఎలా చేయాలి? మీరు కనుగొన్న కండరాలకు సంకోచ, వ్యాకోచాలు చేయాలి. ఈ వ్యాయామాలు చేయాలంటే, ఒక కుర్చీపై కూర్చోండి కాళ్ళను వెడల్పుగా పెట్టండి. మూత్రం నియంత్రిస్తున్నట్లు ప్రయత్నిస్తూ వాటిని సంకోచించండి. మూడు నుండి 5 సెకండ్లపాటు బిగపట్టండి, మరల వదలండి. మరో మార్గంగా మీ కాళ్ళను నొక్కిపెట్టండి కండరాలను సంకోచించండి. మీ పొట్టను లోపలికి లాగవద్దు. మీ శరీరం కింది భాగం నొక్కిపెట్టటమనేది పెల్విక్ లేదా తుటి కండరాలలోనే జరగాలి.
ఈ రకమైన సంకోచ, వ్యాకోచాలు ఎక్కడైనా, ఎపుడైనా సరే చేయవచ్చు. అయితే, మూత్రం పోసేటపుడు ఈ వ్యాయామం చేయకండి. ఏ సమయంలో అయినా చేయవచ్చు కనుక ఈ వ్యాయామం రెగ్యులర్ గా చేస్తూండాలి. పెల్విక్ కండరాల వ్యాయామం చేసేటపుడు మూత్రాశయంలో మూత్రం వుండరాదు. అపుడే వ్యాయామం సమర్ధవంతంగా వుంటుంది. తుటి కండరాల వ్యాయామం మహిళలలో చక్కటి భావప్రాప్తి కలిగేలా చేస్తుంది. కనుక వీరు వీలైనంత త్వరగా మొదలు పెట్టటం మంచిది.
వివిధ భంగిమలు - ఈ రకమైన సంకోచ వ్యాకోచాలు వివిధ భంగిమలలో చేయాలి. అంటే కూర్చుని, పడుకుని, నిలబడి చేయాలి.
గమనించండి - మీ శరీరంపై మీరే జాగ్రత్త వహించాలి. ఈ వ్యాయామాలు చేసేటపుడు శరీరంలోని ఇతర కండరాలకు నష్టం కలుగకుండా చూడండి. అతి మెల్లగా మొదలుపెట్టండి. ఈ వ్యాయామం చేసేటపుడు గుద లేదా తొడ లేదా పొట్ట కండరాలు చేర్చకండి.
డెలివరీ తర్వాత చేసే ఈ వ్యాయామాలు మీ పెల్విక్ కండరాలను బిగువు చేస్తాయి. బరువు తగ్గించేందుకు తోడ్పడతాయి. అయితే వ్యాయామాలు మొదలుపెట్టేముందు వైద్యులను సంప్రదించండి. వారు మీకు సరైన మార్గదర్శకతలు అందిస్తారు.



Click it and Unblock the Notifications