Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
గర్భధారణలో మధుమేహం: దుష్ఫలితాలు
మన దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లుగానే, గర్భిణీల్లో మధుమేహం అధికమవుతున్నది. గర్భ సమయంలో ఈ పరీక్షను తప్పని సరిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గర్భిణీల్లో కనిపించే మధుమేహాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. గర్భధారణకు ముందే మధుమేహం ఉంటే దానిని ప్రీజెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. గర్భధారణ సమయంలో మొదటిసారిగా మధుమేహం బైటపడితే దానిని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు.
మహిళల్లో గర్భధారణ సమయంలో మధుమేహం బైటపడి ప్రసవానంతరం తగ్గిపోయినప్పటికీ, ఆ తరువాత కాలంలో వారికి మధుమేహం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే... మధుమేహ ప్రభావం మామూలు వ్యక్తుల్లోనూ, గర్భిణుల్లోనూ వేర్వేరుగా ఉంటుంది. గర్భంతో ఉన్న స్త్రీలు ప్రారంబంలో ప్రతి 3 వారాలకొకసారి. 6వ, నెల అనంతరం ప్రతి 15 రోజులకొకసారి తప్పని సరిగా ఆరోగ్య పరిస్థితిని పూర్తి స్థాయిలో పరీక్ష చేయించుకోవాలి. ప్రసూతి వైద్యురాలి సూచనలను తప్పక సూచనలను తప్పక పాటించాలి.
గర్భిణీలకు వ్యాధి నియంత్రణలో ఇన్సులిన్ ఇంజక్షన్లను మాత్రమే వాడాలి. మాత్రలు ఉపయోగించరాదు. శిశువు పెరుగుతున్న కొద్దీ ఇన్సులలిన్ వాడకం అధికమౌతుంది. అత్యంత ముఖ్యవిషయం ఏమంటే మూత్రంలో ఎసిటోన్, రక్తపోటు, ఫైలోనెఫ్రయిటిస్ ఏర్పడకుండా వైద్యులచే క్రమంతప్పక పరీక్షలు చేయించుకోవాలి. ఈ విషయంలో అశ్రద్ద వహిస్తే జన్మించిన బిడ్డకు గుండెజబ్బు, అధిక బరువు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు అధికం కావచ్చు. అలాగే మధుమేహం గలస్త్రీలు ఎక్కువ కాన్పులు ధరించిన కొద్దీ వ్యాధి తీవ్రత అధికమయ్యే అవకాశాలున్నాయి. దీనిని జస్టేషనల్ డయాబెటిస్ అంటారు.

గర్భధారణ మొదటి మూడు నెలల్లో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో లేకపోతే బిడ్డకు లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ. చక్కెర స్థాయి నియంత్రణలో లేకపోతే బిడ్డ మరీ బరువు ఎక్కువగా పెరగడం, పుట్టిన తరువాత ఊపిరి తిత్తులు పని చేయకపోవడం, గ్లూకోజ్, కాల్షియం స్థాయి పడిపోవడం, జాండిస్ రావడం వంటి దుష్ఫలితాలు ఎదు రవుతాయి. మరీ ఎక్కువగా నియంత్రిస్తే, కీటోఎసిడోసిస్ అనే పరిస్థితి ఉత్పన్నమై తల్లి కూడా ప్రమాదకర పరిస్థి తిలోకి చేరవచ్చు.
గర్బిణీ స్త్రీల ఆహార విషయంలో సైతం కొన్ని విషమాలను అనుసరించాలి. తీసుకునే ఆహారంలో ప్రతి కిలోకు 50 శాతం క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. అలాగే 50 శాతం క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. అలాగే 50 శాతం కార్బోహైడ్రేట్లు, 20 శాతం మాంసకృత్తులు, 30 శాతం కొవ్వు పధార్థాలుండేలా ఆహార పధార్థాలు తయారు చేసుకోవాలి. మధుమేహంతో ఉన్న గర్భిణులు కడుపులోని శిశువు ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు తాము తీసుకొనే ఆహారంలో రోజుకు కనీసం 350 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. శిశువు పెరుగుదలకు అలాంటి ఆహారం బాగా ఉపకరిస్తుంది. అయితే.., గర్భిణులు బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి.



Click it and Unblock the Notifications
