Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
ఆరు నెలల గర్భం - ఆనందం అంతా మీదే!

ఆరవ నెల గర్భం - 21వ వారం - మీరు గర్భవతి అన్న ఆనందం పూర్తిగా అనుభవిస్తూంటారు. అందుకు అనువైన దుస్తులు ఏర్పరచుకొనండి. ఇక గర్భంలోని మీ బేబీ దంతాలు చిగుళ్ళలో ఏర్పడుతుంటాయి. బేబీకి ఇదే సమయంలో చర్మంలో నూనె గ్రంధులు కూడా ఏర్పడుతూంటాయి.
22వ వారం - మీ బేబీ కండరాలు రోజు రోజుకు బలంగా తయారవుతూంటాయి. మీ గర్భంలో బేబీ కదలికలు అధికమై మీకు నొప్పి కలిగిస్తూంటుంది. బేబీకి కళ్ళు, కనురెప్పలు కూడా వస్తాయి. ఎక్కిళ్ళు, పిత్తులు కూడా గర్భంలోని బేబీ చేస్తూంటుంది. బేబీ గుండె చప్పుడు స్టెతస్కోప్ లేకుండానే వినపడుతూంది. తండ్రి మీ గర్భంపై చెవి ఆనించి బిడ్డ గుండె చప్పుడు వినవచ్చు.
వారం 23 - 22 వారాలు నిండిన గర్భంలోని పిండం ఒక మానవ శరీరంగా రూపొందింది. పెద్దతల, చిన్న శరీరంతో వుంటుంది. ఇక మీరు మానసికంగా, శారీరకంగా మీ బేబీ ప్రసవం కొరకు సిద్ధపడాలి.
ఈ సమయంలో కొన్ని వ్యాయామాలు కూడా అత్యవసరం. అవసరమనుకుంటే వ్యాయామ తరగతులకు చేరండి. ఈ వ్యాయామాలు మీకు యోని ద్వారా శిశు జననానికి దోహదం చేసి అనేక ఆరోగ్య సమస్యలు నివారిస్తాయి. ఈ దశలో మీ బేబీకి కొంత రంగు కూడా ఏర్పడుతుంది. బేబీ వర్ఛస్సు ఏర్పడటానికి ఇది మొదటి దశ. ఒకసారి ఇపుడు మీరు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించి బేబీకిగల ఖచ్చితమైన పొజిషన్, వారాల సంఖ్యను నిర్ధారించుకోవాలి. వైద్యదు్యలు అవసరమనుకుంటే మరి కొన్ని పరీక్షలు కూడా చేస్తారు.
ఈ సమయంలో మీకు మలబద్ధకం, మొలలు వంటి అసౌకర్యాలు కూడా కలుగవచ్చు. శరీరంలో రక్త పరిమాణం పెరుగుతుంది. కొద్దిపాటి రక్తస్రావం కూడా చూపవచ్చు. రక్తం అధికం కావడంవలన లావెక్కుతున్న రక్తనాళాలకు నొప్పి నివారణగా ఐస్ ప్యాక్ మర్దన వంటివి కూడా చేయండి. ఇక ప్రసవానికై మీరు రోజులు లెక్కిస్తూ గడిపేయవచ్చు.



Click it and Unblock the Notifications
