Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కడుపులో బిడ్డ తన్నడం గురించి గర్భిణీలు తెలుసుకోవాల్సిన విషయాలు
మీరు ప్రెగ్నెన్సీ అన్న గుడ్ న్యూస్ తెలియగానే పట్టలేనంత సంతోషంతో.. ఉంటారు. నిజమే కదా ? అయితే గర్భిణీ స్త్రీలు తమ తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి అనేక సమస్యలు ఫేస్ చేస్తారు. బ్లోటింగ్, వెయిట్ గెయిన్, పొట్ట సమస్యలు.. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి.
ఇవన్నీ కాకుండా.. గర్భధారణ సమయంలో.. కొన్ని అనుభూతులు మధురానుభూతులను మిగులుస్తాయి. పొట్టలో బేబీ కదలికలు, కడుపులో తన్నడం వంటి ఫీలింగ్స్ వివరించలేని మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. మొదటిసారి బేబీ మూమెంట్స్ ఫీలవడాన్ని క్విక్కెనింగ్ అని పిలుస్తారు. ఈ క్షణాలు 16 నుంచి 25 వారాల ప్రెగ్నెన్సీ మధ్యలో ఉంటాయి.
మొదటిసారి గర్భధారణలో 25 వారాలు వచ్చే వరకు..మీరు బేబీ కదలికల గురించి అనుభూతి పొందలేరు. అదే రెండోసారి గర్బం దాల్చిన వాళ్లకు 13 వారాలకే బేబీ తన్నుతున్న అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు పొట్టలో బేబీ తన్నడం గురించి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చర్చిద్దాం.

ఫస్ట్ కిక్
మొదటిసారి బేబీ తన్నుతున్న అనుభూతి 18వ వారం నుంచి 25 వారం మధ్యలో కలుగుతుంది.

రెండోసారి తల్లి అయిన వాళ్లకు
రెండోసారి గర్భం దాల్చిన తల్లులకు మొదటిసారి గర్భం దాల్చిన వాళ్ల కంటే ముందుగానే తెలుస్తుంది. సెకండ్ ప్రెగ్నన్సీలో బేబీ తన్నుతున్న అనుభూతి 13వ వారంలోనే గమనిస్తారు.

శిశువు తక్కువ యాక్టివ్ గా ఉండేదెప్పుడు ?
తల్లిలో షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు శిశువు కదలికలు తక్కువవుతాయి. ఇది ఎక్కువగా రాత్రి 9 నుంచి ఉదయం 1 గంట మధ్యలో కనిపిస్తాయి.

ఎడమ వైపు ఎందుకు ?
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల పెరుగుతున్న శిశువుకి రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. అలాగే ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు బేబీ ఎక్కువగా తన్నుతున్న అనుభూతి కూడా మీరు గుర్తించవచ్చు.

కౌంట్
మీ బేబీ ఎన్నిసార్లు తన్నుతున్నాడు అనేది లెక్కపెట్టడం చాలా అవసరమని.. నిపుణులు సూచిస్తున్నారు. 28 వారాల సమయంలో బేబీ కిక్స్ ని లెక్కపెట్టడం వల్ల శిశువుకి ఏదైనా సమస్య ఉందా అనే విషయాన్నీ తేలికగా గుర్తించవచ్చట.

ఫుడ్
కొన్ని రకాల ఆహారాలు బేబీ కదలికలను పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల ఎక్కువ సందర్భాల్లో మిమ్మల్ని తన్నే అవకాశం ఉంటుంది.

కదలికలు
36వ వారంలో ఉన్నప్పుడు శిశువు కదలికలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. గర్భాశయం గోడలు సరిపోకపోవడం, కదలడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల.. తన్నడానికి కష్టంగా మారి.. ఈ కిక్స్ తగ్గుతాయి.



Click it and Unblock the Notifications