Latest Updates
-
నోరూరించే జామకాయ ఊరగాయ..అన్నం, చపాతీల్లోకి కేక.. 10 నిమిషాల్లోనే చేసుకోండిలా.. -
నాగ దోషంతో ఇబ్బందులు పడుతున్నారా? ఈ 5 శక్తివంతమైన మంత్రాలు జపిస్తే చాలు -
ఎండలో నుంచి ఇంటికి రాగానే ఈ పనిచేస్తున్నారా?.. ఈ రిస్క్ తప్పదు.! -
వెయిట్ లాస్ కోసం గ్రీన్ టీ.. రోజులో ఎన్నిసార్లు తాగాలో తెలుసా.? -
మీ ఇంటి తలుపులు ఇలా ఉన్నాయంటే.. పేదరికం కష్టాలు తప్పవు.! -
Happy Bakrid 2026: బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు? మీ ముస్లిం ఫ్రెండ్స్ కు బక్రీద్ విషెస్ ఇలా చెప్పండి! -
ప్రతి సోమవారం ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి.. జీవితంలో అద్భుత మార్పులు చూస్తారు! -
మామిడికాయ పచ్చడి ఇలా చేస్తే.. ఆ Authentic Taste at Home మీ సొంతం! ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు -
మే 27: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం..అదృష్టం మీ తలుపు తడుతోంది, అస్సలు మిస్ అవ్వకండి! -
రవి, సర్వార్థ సిద్ధి యోగాల కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే!
బక్రీద్‌కి మటన్‌తో ఘుమఘుమలాడే వంటకాలు.. ఈ వెరైటీలతో పండుగ మరింత ప్రత్యేకం.!
ముస్లిం సోదరుల పవిత్ర పండుగ బక్రీద్‌ను తెలుగు
రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొంటారు. ఈద్-ఉల్-అధా కేవలం పండుగ మాత్రమే
కాదు.. త్యాగానికి, సహాయం, విశ్వాసం వంటి వాటికి ప్రతీకగా భావిస్తారు.
అల్లాకి ప్రార్థనల అనంతరం మేకలను బలిచ్చి రుచికరమైన వంటలను
ఆస్వాదిస్తారు. ఈసారి మటన్‌తో ఈ కొత్త రకాల వంటలను చూడండి.
మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా నచ్చి తీరుతాయి.

పండుగ సమయాల్లో మటన్ కర్రీ, మటన్ బిర్యానీ ఎప్పుడూ చేసుకునేవే. వాటిలో ఉపయోగించే పదార్థాలతోనే రుచికరమైన కొత్త రకాల వంటలను చేసుకోవచ్చు. అవే మటన్ కల్మీ కబాబ్, మటన్ సుక్కా, మటన్ పెప్పర్ ఫ్రై, మటన్ ఘీ రోస్ట్. ఎక్కువ టైం తీసుకోకుండా మటన్ కర్రీ చేసే టైంలోనే ఈ వంటలను చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
మటన్ కల్మీ కబాబ్‌కి కావాల్సిన పదార్థాలు
మటన్ కీమా- 500 గ్రాములు
ఉల్లిపాయ- ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి
పచ్చి మిరపకాయలు- రెండు
అల్లం- వెల్లుల్లి పేస్ట్- 1 టేబుల్ స్పూన్
గరం మసాలా- 1 టీస్పూన్
ఎర్ర కారం పొడి- 1 టీస్పూన్
వేయించిన శనగపిండి- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి తగినంత
వెన్న లేదా నూనె
మటన్ కల్మీ కబాబ్ తయారీ విధానం
-మటన్ కల్మీ కబాబ్ కోసం ముందుగా మటన్ కీమాను ఓ గిన్నెలేకి తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో వేయించిన శనగపిండిని కలుపుకోవాలి. మీ చేతులకు కొద్దిగా నూనె రాసుకుని వాటిని కబాబ్‌లుగా చేసుకోవాలి. అనంతరం వాటిని పుల్లలకు లేదంటే చెక్క పుల్లలకు గుచ్చాలి. తర్వాత ఓవెన్‌లో లేదా పెనంపై బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. ఫైనల్‌గా పూర్తయిన కబాబ్‌లపై వెన్న పూసి ప్లేట్‌లో పెట్టేయడమే. అంతే రుచికరమైన మటన్ కల్మీ కబాబ్ రెడీ...

మటన్ సుక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు
మటన్- 500 గ్రాములు
ఉల్లిపాయలు- రెండు
టమాటా- ఒకటి
అల్లంవెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్
స్పూన్
కొబ్బరి పొడి- రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు- రెండు రెబ్బలు
కారం- రెండు టీ స్పూన్లు
పసుపు- కొద్దిగా
కొత్తిమీర
గరం మసాలా- టీ స్పూన్
నూనె- తగినంత
ఉప్పు- తగినంత
మటన్ సుక్కా తయారీ విధానం
-శుభ్రంగా కడిగిన మటన్‌ను ప్రెషర్ కుక్కర్‌లో వేసి అందులో ఉప్పు, పసుపు వేసి మూడు విజిల్స్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి వేగాక కరివేపాకు వేసి వేగనివ్వాలి. దోరగా అయ్యాక అల్లం-వెల్లుల్లి పేస్ట్, టమోటాలు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఇప్పుడు అన్ని మసాలాలు, కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి వేసి కలియతిప్పాలి కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా ఉడికించిన మటన్ వేసి దగ్గరగా అయ్యే వరకు మీడియం మంటపైన వేగనివ్వాలి. అంతే మటన్ సుక్కా రెడీ. వీటిని పరాటాలు లేదా వేడివేడి అన్నంతో వడ్డించుకుంటే రుచి అదిరిపోతుంది.
మటన్ పెప్పర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
మటన్- 500 గ్రాములు
మిరియాల పొడి- 2 టీస్పూన్లు
ఉల్లిపాయ- ఒకటి
కరివేపాకు
అల్లం- వెల్లుల్లి పేస్ట్- ఒక టీస్పూన్
సోంపు- టీ స్పూన్
పసుపు- కొద్దిగా
నూనె- రెండు స్పూన్లు
ఉప్పు- తగినంత
మటన్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా, ప్రెషర్ కుక్కర్‌లో మటన్ వేసి పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి సోంపు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం- వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మటన్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. మటన్‌కి మసాలాలు వేసి బాగా పట్టే వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి. మటన్ దగ్గరికి అయ్యాక చివరిగా మరోసారి కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. వేడివేడి అన్నంలోకి మటన్ పెప్పర్ ఫ్రైతో కలుపుకొని తింటే ఘాటుగా రుచి అమోఘంగా ఉంటుంది.
మటన్ గీ రోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
మటన్- 500 గ్రాములు
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు
పెరుగు- రెండు టేబుల్ స్పూన్లు
కారం పొడి- ఒక టీస్పూన్
నల్ల మిరియాల పొడి- ఒక టీ స్పూన్
గరం మసాలా- ఒక టీ స్పూన్
చింతపండు నీరు- ఒక టీ స్పూన్
అల్లం- వెల్లుల్లి పేస్ట్- ఒక టీస్పూన్
ఉప్పు- రుచికి తగినంత
మటన్ గీ రోస్ట్ తయారీ విధానం
-ముందుగా మటన్‌ను పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, మసాలాలతో కలిపి ఒక పావుగంట సేపు నాననివ్వాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడి చేసి కరివేపాకు వేసి వేగనివ్వాలి. మసాలాలు, చింతపండు రసం వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన మటన్ వేసి, నెయ్యి పైకి తేలే వరకు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. చపాతీలు లేదా బగారా అన్నంలోకి ఈ రెసిపీ అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications