Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
రెగ్యులర్ గా చేసే మటన్ బిర్యానీ వెరైటీలు కాకుండా మటన్ తో ఏదైనా కొత్తరకం వంటకం తయారుచేయాలనుకుంటే మటన్ తహరీ ఖచ్చితంగా ఓ సారి ట్రై చేయాల్సిందే.
ఒక్కసారి ఈ స్పైసీ అండ్ జ్యూసీ మటన్ తహరీ రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. మసాలాల ఘుమఘుమలతో, నోట్లో ఇట్టే కరిగిపోయే లేత మటన్ ముక్కలతో ఉండే ఈ కంఫర్ట్ మీల్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

మటన్ తహరీ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఆవ నూనె - అర కప్పు
మటన్ (ఎముకలతో) - అర కిలో
ఉల్లిపాయ - 1
టమాటాలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకులు - 2
మిరియాలు - 5
లవంగాలు - 4
పచ్చ యాలకులు - 4
నల్ల యాలకు - 1
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
కారం - 1 టేబుల్ స్పూన్
పసుపు - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - నాలుగున్నర కప్పులు
నానబెట్టిన బియ్యం - 2 కప్పులు
పచ్చిమిర్చి - 5 నుండి 6
ఆలూ బుఖారా - 4 లేదా 5
కొత్తిమీర, పుదీనా - కొద్దిగా
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి!
మటన్ తహరీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఆవ నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక మసాలా దినుసులు (బిర్యానీ ఆకులు, మిరియాలు, లవంగాలు, యాలకులు, చెక్క) వేసి వేయించండి.
-ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి, లేత బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించండి.
-శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలను కుక్కర్ లో వేసి బాగా కలపండి. అందులోనే టమాటా ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి మటన్‌కు మసాలాలు పట్టేలా కొద్దిసేపు ఉడికించండి.
-ఇప్పుడు నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టండి. మటన్ ముక్క మెత్తగా ఉడికే వరకు సుమారు 25-30 నిమిషాల పాటు ఉడికించండి.
-కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి, ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పచ్చిమిర్చి, ఆలూ బుఖారా, కొత్తిమీర, పుదీనా వేసి సున్నితంగా కలపండి. ఈ దశలో ఉప్పు సరిచూసుకోండి.
-మంటను హై ఫ్లేమ్ లో పెట్టి నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి. ఆ తర్వాత మూతపెట్టి, మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి సుమారు 10 నిమిషాల పాటు దమ్ చేయాలి.
-అంతే.. గుమగుమలాడే వేడివేడి మటన్ తహరీ రెడీ. అన్నం మెతుకు విరగకుండా ప్లేట్ లోకి తీసుకుని, చల్లని రైతా, ఉల్లిపాయ సలాడ్ తో వడ్డిస్తే దీని రుచి అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
