Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి!
రాఖీ పండుగ అనగానే తోబుట్టువులు సోదరులకు కట్టే రాఖీలతో పాటు మార్కెట్లో రకరకాల స్వీట్లు కూడా కనబడుతుంటాయి. ఈ ఏడాది ఆగస్టు 28న రాఖీ పండుగను జరుపుకుంటారు. రాఖీ పండుగ రాగానే మార్కెట్లో రంగురంగుల స్వీట్లు దర్శనమిస్తాయి. కానీ మీ ఇంట్లో మీ చేతులతో చేసిన స్వీట్ సోదరుడికి తినిపిస్తే ఆ ఆనందమే వేరు.
రాఖీ పండుగకి మీ ఇంట్లోనే తయారుచేయగలిగన అద్భుతమైన స్వీట్ కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్. పాలలో ఉండే కమ్మదనం, కుంకుమపువ్వు సువాసన, పిస్తాపప్పుల రుచి కలగలిసిన ఈ స్వీట్ పండుగకు మరింత శోభను తెస్తుంది.

కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ తయారీకి కావలసిన పదార్థాలు
చిక్కటి పాలు (ఫుల్ క్రీమ్ మిల్క్) - 1 లీటరు
నిమ్మరసం - 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
పంచదార - 4 నుండి 5 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు రేకులు - 8-10
యాలకుల పొడి - అర టీస్పూన్
పిస్తా పప్పులు - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - ట్రేకి రాయడానికి కొద్దిగా
కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ తయారీ విధానం
-ముందుగా గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు నానబెట్టుకోవాలి.
-తర్వాత మందపాటి అడుగు ఉన్న వెడల్పాటి గిన్నెను తీసుకుని, పాలు పోసి మీడియం మంటపై మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. గిన్నె అంచులకు అంటుకునే మీగడను గీకి మళ్లీ పాలలోనే కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మిల్క్ కేక్ కు అద్భుతమైన రుచి, చిక్కదనం వస్తుంది.
-పాలు సగానికి పైగా ఇగిరిపోయే వరకు ఉడికించాలి.
-పాలు బాగా చిక్కబడిన తర్వాత, మంటను పూర్తిగా తగ్గించాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా వేస్తూ నెమ్మదిగా కలపాలి. పాలు పన్నీర్ లాగా పూర్తిగా విరిగిపోకుండా, కేవలం చిన్నచిన్న పూసల్లా మారేలా చూసుకోవాలి. మిల్క్ కేక్ ప్రత్యేకత అంతా ఈ నోట్లో కరిగిపోయే పూసల ఆకృతిలోనే ఉంటుంది.
-పాలు పూసల్లా మారిన తర్వాత, అందులో చక్కెర, ముందుగా నానబెట్టుకున్న కుంకుమపువ్వు మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇవన్నీ బాగా కలిసేలా తక్కువ మంటపై ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడి, గిన్నె అంచులను వదిలేస్తున్న సమయంలో... యాలకుల పొడి, సగం తరిగిన పిస్తా పప్పులను వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి.
-ఒక చతురస్రాకారపు ట్రేకి కొద్దిగా నెయ్యి రాసి ఉంచుకోవాలి. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ట్రేలో వేసి సమానంగా సర్దాలి. దీనిపైన మిగిలిన పిస్తా పలుకులు, కొన్ని కుంకుమపువ్వు రేకులను చల్లి నెమ్మదిగా చేత్తో అదమాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనిచ్చి, ఆ తర్వాత కనీసం 2-3 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. అది బాగా గట్టిపడిన తర్వాత, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కత్తిరించుకోవాలి.
-రక్షాబంధన్ రోజున మీ సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత, మీరు ప్రేమతో చేసిన ఈ కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ తినిపించండి. ఈ స్వీట్ తిన్నాక, మీ సోదరుడు మీ వంటకు ముగ్ధుడవటం ఖాయం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
