రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

చికెన్ తో ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలు చేసి, తిని విసిగిపోయారా? చికెన్ తో కొత్తగా, స్పైసీగా ఉండేలా ఏదైనా తయారుచేసుకుంటే బాగుంటది అనిపిస్తుందా? అయితే చికెన్ మసాలా రెసిపి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడాల్సిందే. అన్నం, రోటీ, చపాతీ, పుల్కాలలోకి ఈ చికెన్ మసాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

నోట్లో పెట్టుకోగానే ఆహా ఇన్ని రోజులు ఇదెలా మిస్ అయ్యాం అని ఫీల్ అవక తప్పదు. చికెన్ మసాలా మీ ఇంట్లో ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Chicken Masala Recipe in Telugu Best Side Dish For Rice Chapati

చికెన్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు

మ్యారినేషన్ కోసం

-చికెన్
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-పెరుగు
-ఎర్ర కారం పొడి
-ఉప్పు
-పసుపు

మసాలా కోసం:

-ధనియాలు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-నల్ల యాలకలు
-పచ్చ యాలకలు
-బిర్యానీ ఆకు
-దాల్చిన చెక్క
-ఎండు కొబ్బరి
-లవంగ మొగ్గలు
-మిరియాలు

గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి!

చికెన్ మసాలా తయారీ విధానం

-ముందుగా అర కేజీ చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. తర్వాత చికెన్ ముక్కలలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడి, అర టేబుల్ స్పూన్ ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలిపి అర గంట సేపు పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 4 పచ్చ యాలకలు, 1 నల్ల యాలక, ఎండు కొబ్బరి ముక్కలు,7 మిరియాలు, 4 లవంగ మొగ్గలు, 3 ఎండు మిరపకాయలు వేసి మొత్తాన్ని వేయించాక స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. తర్వాత వాటన్నింటినీ మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.

-నూనె వేడెక్కాక అందులో 2-3 మీడియం ఉల్లిపాయల తరుగు వేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా 4-5 నిమిషాలు వేయించాలి. తర్వాత ఇందులో పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసి 7-8 నిమిషాలు ఉడికించాలి.

-7-8 నిమిషాల తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, రెడీ చేసుకున్న మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మూతపెట్టి 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి.

-4-5 నిమిషాల తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి చికెన్ ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.

-చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆపేయండి.

-అంతే చికెన్ మసాలా రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, October 15, 2026, 11:45 [IST]
Desktop Bottom Promotion