Latest Updates
-
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ..
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అందులోనూ మన సాంప్రదాయక తీపి వంటకం ఖాజా పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పంచదార పాకంతో చేసిన జ్యూసీ ఖాజానే. కానీ, ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త విభిన్నంగా, ఆరోగ్యానికి మేలు చేసే బెల్లంతో ఎప్పుడైనా ఖాజాను రుచి చూశారా?
బయట కరకరలాడుతూ, లోపల పొరలు పొరలుగా ఉంటూ, నోట్లో వేసుకోగానే కరిగిపోయే బెల్లం తియ్యదనంతో నిండి ఉండే బెల్లం ఖాజా రుచి అద్భుతంగా ఉంటుంది. అచ్చం స్వీట్ షాపు స్టైల్‌లో కమ్మటి బెల్లం ఖాజాను మీ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలేమిటో ఇక్కడ చూడండి.

బెల్లం ఖాజా తయారీకి కావలసిన పదార్థాలు
మైదా పిండి - 500 గ్రాములు
బెల్లం - 500 గ్రాములు
పాలు - అర లీటరు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
యాలకుల పొడి - 1 టీస్పూన్
ఎండు కొబ్బరి తురుము - 1 కప్పు
నీళ్లు - పాకానికి సరిపడా
నూనె లేదా నెయ్యి - డీప్ ఫ్రైకి సరిపడా
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక!
బెల్లం ఖాజా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పాలను కొద్దికొద్దిగా పోస్తూ పిండిని మరీ గట్టిగా కాకుండా, చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. ఈ పిండిపై మూత పెట్టి 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-నానిన పిండిని సమానమైన ఉండలుగా విభజించుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని పల్చటి చపాతీల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని, దానిపై కొద్దిగా నెయ్యి రాసి, కొంచెం పొడి పిండి చల్లాలి. దానిపై మరో చపాతీని ఉంచి, మళ్లీ నెయ్యి, పొడి పిండి చల్లాలి. ఇలా అన్ని చపాతీలను ఒకదానిపై ఒకటి పేర్చాలి.
-ఇలా పేర్చిన చపాతీలను గట్టిగా రోల్ లాగా చుట్టాలి. ఆ రోల్ ను చాకుతో చిన్న చిన్న ముక్కలుగా (అంగుళం మందంతో) కట్ చేసుకోవాలి. ప్రతి ముక్కను తీసుకుని అప్పడాల కర్రతో తేలికగా, నిలువుగా ఒక్కసారి అలా ఒత్తితే అందమైన పొరల ఖాజా ఆకారం వస్తుంది.
-స్టవ్ వెలిగించి, మందపాటి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. నూనె కాగాక, మంటను మీడియం సిమ్ లో ఉంచి, ఖాజాలను వేసి బంగారు రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-మరో గిన్నెలో తురిమిన బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి లేత పాకం వచ్చేలా మరిగించాలి. పాకం మంచి సువాసన రావడానికి అందులో యాలకుల పొడి కలపాలి.
-వేడిగా ఉన్న పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న ఖాజాలను వేయాలి. పాకం ఖాజా పొరల్లోకి బాగా పీల్చుకునేలా ఒకటి రెండు నిమిషాలు ఉంచి తీసేయాలి.
-పాకంలో నుంచి తీసిన ఖాజాలను ఒక ప్లేట్ లోకి తీసుకుని కాసేపు చల్లారనివ్వాలి. అంతే నోరూరించే బెల్లం ఖాజా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
