Latest Updates
-
వ్యాధి ఒకటే అయినా స్త్రీ, పురుషుల్లో వేర్వేరు లక్షణాలు.. పోల్చుకుంటే ప్రాణ ముప్పు తప్పదు.! -
సెప్టెంబర్ 2026 రాశి ఫలాలు: వీరి అదృష్టం మారబోతుంది.. 12 రాశుల ఫలితాలివే.! -
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.!
బ్యూటీ సీక్రెట్.. చుక్క నీరు, మినప్పప్పు లేకుండా నిమిషాల్లో చేసుకునే కీరదోస ఇడ్లీ.!
స్పాంజీలా, మెత్తగా, వేడివేడిగా ఉంటూ తినేకొద్దీ తినాలనిపించే ఇడ్లీలు డైట్‌లో ముందుంటాయి. కానీ తెల్లగా ఉండే ఈ ఇడ్లీల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని కొందరు దూరంగా ఉంటారు. అలాగని పూరీ, దోశ, బోండాలాంటి ఆయిల్ టిఫిన్స్ తినలేని వారు ఇడ్లీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి అలాంటప్పుడు ఎలాంటి భయం లేకుండా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ కావాలంటే ఈ కీరదోస ఇడ్లీ ట్రై చేయండి.

సీజన్ ఏదైనా కీరదోసకి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. మెడిసిన్ తయారీలోనూ, బ్యూటీ ప్రొడక్ట్స్‌లో మాత్రమే కాదు.. భోజనం తర్వాత ఈజీగా అరుగుదల అయ్యేందుకు కీరదోస తింటాం. ఇక మార్నింగ్, ఈవెనింగ్ సలాడ్ మాదిరిగా తీసుకుంటాం. శరీరానికి చలువ చేయడంతో పాటు కీరదోసతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి ఆరోగ్య ప్రదాయిని కుకుంబర్‌తో ఇలా హెల్తీగా ఇన్‌స్టంట్ ఇడ్లీ ట్రై చేయండి. రెగ్యులర్ ఇడ్లీల మాదిరిగా మెత్తగా, నోట్లో వేస్తే కరిగేపోయేలా రుచికరంగా ఉంటాయి.
కీరదోస ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
కీరదోస- రెండు
తురిమిన పచ్చికొబ్బరి- కప్పు
పచ్చిమిర్చి- ఒకటి
అల్లం ముక్క- చిన్నది
కొత్తిమీర- గుప్పెడు
ఉప్పు- టీస్పూన్
పెరుగు- రెండు టేబుల్ స్పూన్లు
ఇడ్లీ రవ్వ- కప్పు
కీరదోస ఇడ్లీ తయారీ విధానం
కీరదోస ఇడ్లీ కోసం ముందుగా వీటిని తొక్క తీయకుండా గ్రేటర్ సాయంతో తురుముకోవాలి. ఈ తురుమును ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.

మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి తురుము, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కీరదోస తురుములో కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో అల్లంముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. చివరిగా ఇడ్లీ రవ్వను రెండు సార్లు బాగా కడిగి నీళ్లు లేకుండా బాగా పిండి ఈ మిశ్రమంలో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక పదినిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి.

తర్వాత ఇడ్లీ స్టీమర్ తీసుకుని అందులో నీళ్లు పోసి కాగనివ్వండి. ఈ లోపు ఇడ్లీ ప్లేట్ తీసుకుని వాటిలో కొద్దిగా నూనె అప్లై చేసి ఈ పిండి మిశ్రమాన్ని గరిటెతో అప్లై చేయండి. ప్లేట్ మొత్తం నింపుకొన్న తర్వాత స్టీమర్‌లో పెట్టి మూత పెట్టి 8 నిమిషాల పాటు మీడియం మంటపైన ఆవిరిమీద ఉడికించండి.
స్టవ్ ఆఫ్ చేసి కాసేపటి తర్వాత మూత తీసి చూడండి. మెత్తగా, స్పాంజీలా ఉండే కుకుంబర్ ఇడ్లీ రెడీ. బరువు తగ్గాలనుకునేవారికి మాత్రమే కాదు.. మెరిసే చర్మం కోసం ఈ కీరదోస ఇడ్లీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సీజన్ ఏదైనా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది ముందుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications