Latest Updates
-
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే?
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే!
పిల్లలకు కూరగాయలు తినిపించడం అంటే తల్లిదండ్రులకు రోజూ ఒక పెద్ద సవాలే. ముఖ్యంగా క్యారెట్లు, టమాటాలు అనగానే చాలా మంది పిల్లలు ముఖం చిట్లిస్తారు, ప్లేటు పక్కకు నెట్టేస్తారు. కానీ వారి ఎదుగుదలకు ఈ కూరగాయలు ఎంతో అవసరం. మరి వారికి ఇష్టమైన రీతిలో వీటిని ఎలా తినిపించాలి? మీ పిల్లల కోసం ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యారెట్ టమాటా సూప్ తయారు చేయండి. ఈ కమ్మని రుచికి పిల్లలు ఫిదా అవ్వడమే కాదు, గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు.
క్యారెట్ టమాటా సూప్ తయారీకి కావలసిన పదార్థాలు
ఎర్రగా పండిన టమాటాలు - 2
తాజా క్యారెట్లు - 2 లేదా 3
మిరియాల పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - కొద్దిగా
నీళ్లు - తగినంత

క్యారెట్ టమాటా సూప్ తయారీ విధానం
-ముందుగా టమాటాలు, క్యారెట్లను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో ఈ ముక్కలు వేసి, చిటికెడు ఉప్పు జతచేసి ఉడికించాలి. ముక్కలు బాగా మెత్తబడే వరకు మంట మీద ఉంచాలి.
-క్యారెట్, టమాటా ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు కాబట్టి ఆ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత ఉడికిన ముక్కలను నీళ్లతో సహా బ్లెండర్ లేదా మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి, ఈ గ్రైండ్ చేసిన సూప్ మిశ్రమాన్ని అందులో పోయాలి. సూప్ మరీ చిక్కగా ఉంటే, తాగడానికి వీలుగా ఉండేలా తగినన్ని నీళ్లు కలుపుకోవాలి.
-ఈ సూప్ లో కొద్దిగా చక్కెర, నల్ల మిరియాల పొడి వేసి సన్నని మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే క్యారెట్ టమాటా సూప్ రెడీ.
ఈ సూప్ ఎందుకు తాగాలి?
ఈ సూప్ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక దివ్యౌషధం. జంక్ ఫుడ్ బదులు సాయంత్రం వేళ ఈ సూప్ ఇస్తే కలిగే లాభాలు చాలానే ఉన్నాయి.
-టమాటాల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల శరీరంలో ఇమ్యూనిటీని అద్భుతంగా పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.
-క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ ఏ గా మారి కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.
-టమాటాలోని గుణాలు చర్మానికి లోపలి నుండి పోషణను అందించి, చలికాలంలో చర్మం పొడిబారకుండా కాపాడతాయి.
-ఈ వేడివేడి సూప్ తాగడం వల్ల పిల్లల్లో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం లాంటి పొట్ట సమస్యలు దరిచేరవు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
