Latest Updates
-
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా..
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన స్వీట్. పంచదారకు బదులుగా బెల్లం, ఎన్నో రకాల గింజలతో చేసే ఈ చిక్కీ పోషకాల గని అని చెప్పవచ్చు. నీరసంగా ఉన్నప్పుడు ఒక ముక్క తింటే ఎంతో మేలు జరుగుతుంది.ఈ చిక్కీలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు స్నాక్ గా దీనిని ఇస్తే అనేక పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారు.
ఇది పిల్లల జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని అద్భుతంగా పెంచడంలో సాయపడుతుంది.ఇదే చిక్కీని బయట కొనాలంటే చాలా డబ్బులు ఖర్చుపెట్టాల్సిందే. ఇంట్లోనే హెల్తీగా, హైజీన్ గా క్రీస్పీ డ్రై ఫ్రూట్ చిక్కీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

డ్రై ఫ్రూట్ చిక్కీ తయారీకి కావాల్సిన పదార్థాలు
గుమ్మడి గింజలు
బాదంపప్పులు
జీడిపప్పులు
పుచ్చ గింజలు
బెల్లం
యాలకల పొడి
నెయ్యి
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్!
డ్రై ఫ్రూట్ చిక్కి తయారీ విధానం
-ముందుగా ఒక పళ్లెం లేదా ప్లేట్ లో కొద్ది నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్లేట్ ను పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే గిన్నె లేదా పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో 1 చిన్న గ్లాసు(100 గ్రా)బాదంపప్పులు వేసి బాగా వేయించుకోవాలి.
-బాదంపప్పులు మూడొంతులు వేగిన తర్వాత అందులో 1 గ్లాసు(100గ్రా) జీడిపప్పు వేసి అవి కొంచెం వేగాక అందులో 1 గ్లాసు(100గ్రా) గుమ్మడి గింజలు, 1 గ్లాసు పుచ్చ గింజలు వేసి వీటిని 2-3 నిమిషాలు వేయించుకుంటే చాలు. ఇవి త్వరగానే వేగిపోతాయి.
-అన్నీ ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వాటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి. అందులో 3 గ్లాసుల(350గ్రా)బెల్లం తురుము వేసి ఇందులోనే అర గ్లాసు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి.
-బెల్లం కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి. మళ్లీ స్టవ్ మీద పెట్టేసి పాకం దగ్గరపడేవరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో పాకం చెక్ చేసుకుంటుండాలి. ఒక ప్లేట్ లో నీళ్లు పోసి అందులో బెల్లం పాకం కొంచెం పొడవుగా వేయండి.. దాన్ని చేత్తో నొక్కి తీసుకుంటే ఠక్కుమని శబ్దం వస్తూ విరగాలి. అప్పుడు పర్ఫెక్ట్ గా అయినట్లు లెక్క.
-ఇప్పుడు మంటను మీడియంలోనే ఉంచి బెల్లం పాకంలో కొంచెం యాలకల పొడి వేసి కలుపుకోండి. తర్వాత వేయించిన పప్పులన్నీ అన్నీ బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. ఒక ముద్దగా అయ్యేంతవరకు కలుపుకున్నాక స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ముందుగా నెయ్యి రాసి ఉంచిన ప్లేట్ లోకి ఈ పప్పుల మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు అడుగు ఫ్లాట్ గా ఉండే ఒక చిన్న గిన్నె తీసుకోండి. దాని అడుగున కొంచెం నెయ్యి రాసి దాని సాయంతో చిక్కీని ఫ్లాట్ గా స్ప్రెడ్ చేసుకోండి. మధ్యలో గ్యాప్స్ లేకుండా అంతా సమానంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి.
-2 నిమిషాల తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకుతో ముక్కలుగా స్క్వేయర్ షేపులో లేదా మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోవచ్చు. అంతే హెల్తీ ట్రై ఫ్రూట్ చిక్కీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
