Latest Updates
-
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు! -
భోజనం తర్వాత డెజర్ట్ లేదా డ్రింక్‌కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.! -
ఏం జరుగుతోందిరా: పగలు ప్రియుడితో, రాత్రి భర్తతో ఉంటా..మహిళ కోరికతో అందరికీ మైండ్ బ్లాక్! -
జిమ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. వెళ్లేముందు ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.! -
బ్రేక్‌ఫాస్ట్‌లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.! -
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం, భద్ర, పంచకాలు.. మరి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.? -
ఇడ్లీ, దోశలు కాదు.. చుక్క నూనె లేకుండా ఆవిరిపై ఉడికే సొరకాయ కడుబు.. బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్!
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది!
ప్రతిరోజూ మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసం సాంబార్, పప్పు, రసం చేసి విసుగొచ్చేసిందా? వంటగదిలో గంటల తరబడి నిల్చోవడం కష్టంగా అనిపిస్తోందా? అయితే మీకోసం అద్భుతమైన వంటకం ఉంది. అదే దొండకాయ మసాలా రైస్.
దొండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది దివ్యౌషధం. కానీ చాలామంది దీన్ని ఫ్రై లేదా కూర చేస్తే తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఒక్కసారి ఇలా దొండకాయతో మసాలా రైస్ చేసి చూడండి. అచ్చం బిర్యానీ తిన్న అనుభూతి కలుగుతుంది. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

దొండకాయ మసాలా రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
దొండకాయలు - 15
బియ్యం - 1 కప్పు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
మసాలా పొడి కోసం
నూనె - 1 టీస్పూన్
ఎండు మిర్చి - 5
పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
నువ్వులు - 1 టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - 2 టీస్పూన్లు
తాలింపు కోసం
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు - అర టీస్పూన్
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు!
దొండకాయ మసాలా రైస్ తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టండి. కుక్కర్లో ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని, కొద్దిగా నువ్వుల నూనె, ఉప్పు వేసి కలిపి చల్లారనివ్వండి.
-స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడి చేయండి. అందులో పచ్చి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించండి. ఇవి ఎర్రగా వేగాక ధనియాలు, మిరియాలు, నువ్వులు వేసి కాసేపు వేయించి, చివరగా కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీలో వేసి మెత్తటి పొడిలా పట్టుకోండి.
-దొండకాయలను శుభ్రంగా కడిగి నిలువుగా నాలుగు ముక్కలుగా కోసుకోండి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేయండి. ఇందులో దొండకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మీడియం మంట మీద వేయించండి. దొండకాయలు కాస్త మగ్గాక, ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా ఉడకనివ్వండి.
-దొండకాయలు పూర్తిగా ఉడికిన తర్వాత, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అందులో వేసి బాగా కలపండి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ గ్రేవీకి నిమ్మరసం, కొత్తిమీర కలపండి.
-చివరగా చల్లారిన అన్నాన్ని ఈ దొండకాయ మసాలాలో వేసి నెమ్మదిగా కలుపుకోండి.
-అంతే దొండకాయ మసాలా రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications