Latest Updates
-
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
భోజనం తర్వాత డెజర్ట్ లేదా డ్రింక్‌కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.! -
ఏం జరుగుతోందిరా: పగలు ప్రియుడితో, రాత్రి భర్తతో ఉంటా..మహిళ కోరికతో అందరికీ మైండ్ బ్లాక్! -
జిమ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. వెళ్లేముందు ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.! -
బ్రేక్‌ఫాస్ట్‌లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.! -
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం, భద్ర, పంచకాలు.. మరి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.? -
ఇడ్లీ, దోశలు కాదు.. చుక్క నూనె లేకుండా ఆవిరిపై ఉడికే సొరకాయ కడుబు.. బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఐరన్ గని, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్.. ఎన్నో లాభాలున్న హలీమ్ సీడ్స్ లడ్డూ ఎలా చేసుకోవాలంటే.. -
గుండెల్ని పిండేస్తున్న విశాఖ చిన్నారి ఉదంతం..డాక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు! -
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం!
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు!
ఉదయం బ్రేక్ స్ట్ రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యకరంగా ఉండటం చాలా ముఖ్యం. రోజూ తినే రొటీన్ ఇడ్లీ, దోశలకు బదులుగా కాస్త వెరైటీగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్ టే రాగి ఇడ్లీ మీకు ఒక బెస్ట్ ఛాయిస్. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి ఎన్నో విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి, రక్తహీనతను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.
అయితే రాగి ఇడ్లీ చేసేటప్పుడు చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. ఇడ్లీలు గట్టిగా లేదా జిగురుగా రావడం. పిండిని సరైన పద్ధతిలో రుబ్బి, పులియబెడితే మల్లెపూవుల్లాంటి మెత్తటి రాగి ఇడ్లీలను మీరూ ఇంట్లోనే సులభంగా తయారుచేయవచ్చు. ఆ పక్కా కొలతలు, తయారీ విధానం ఇక్కద చూడండి.

రాగి ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
రాగులు - 1 కప్పు
ఇడ్లీ బియ్యం - 1 కప్పు
పొట్టు తీయని మినపప్పు (లేదా మినపగుళ్లు) - అర కప్పు
మెంతులు - అర టీస్పూన్
అటుకులు - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి
నీళ్లు - తగినన్ని
రాగి ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో రాగులు, ఇడ్లీ బియ్యం, మినపప్పు, మెంతులు వేసి నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కనీసం 6 నుంచి 8 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. అటుకులను మాత్రం పిండి రుబ్బడానికి పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది.
-ఉదయం లేచిన తర్వాత, నానబెట్టిన మిశ్రమంలోని నీటిని వంపేయాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లేదా గ్రైండర్ తీసుకుని నానబెట్టిన రాగులు, బియ్యం, మినపప్పుతో పాటు నానబెట్టిన అటుకులను కూడా వేసి తగినన్ని చల్లటి నీళ్లు పోస్తూ రుబ్బుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా, కాస్త బరకగా ఉండేలా చూసుకోవాలి.
-రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, పిండిలో గాలి చేరేలా మీ చేతితో లేదా గరిటెతో 2-3 నిమిషాల పాటు బాగా గిలకొట్టాలి. దీనివల్ల ఇడ్లీలు మరింత మృదువుగా వస్తాయి.
-ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి, 5 నుండి 6 గంటల పాటు పిండిని పులియబెట్టాలి. పిండి బాగా పులిసి, తేలికగా (ఫ్లఫ్ఫీగా) పైకి ఉబ్బుతుంది. ఇలా వస్తే మీ పిండి ఇడ్లీలకు పర్ఫెక్ట్ సిద్ధమైనట్లే. ఇప్పుడు అందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి, పిండిలోని గాలిపోకుండా గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలి.
-ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టి, తగినన్ని నీళ్లు పోసి మరిగించండి. ఈలోపు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, తయారుచేసుకున్న రాగి పిండిని అచ్చుల్లో వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ స్టాండ్ పాత్రలో పెట్టి మూతపెట్టాలి. మీడియం మంట మీద సుమారు 12 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించి స్టవ్ ఆపేయండి.
-అంతే రాగి ఇడ్లీలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications