గంటల సమయం పట్టకుండా.. కేవలం 20 నిమిషాల్లోనే రుచికరమైన నిమ్మకాయ పచ్చడి చేసుకోండిలా!

Posted By:

భోజనం చేసేటప్పుడు కంచంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా, పక్కన ఒక చెంచా పచ్చడి ఉంటే ఆ రుచే వేరు. మామూలు అన్నాన్ని సైతం ఎంతో ప్రత్యేకంగా, కమ్మగా మార్చేసే అద్భుత శక్తి ఒక్క ఊరగాయకు మాత్రమే ఉంది. అందుకే మనందరం పచ్చళ్లను ఎంతో ఇష్టపడతాం. ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసే నిమ్మకాయ పచ్చడి తన పుల్లని, కారమైన ప్రత్యేక రుచితో ప్రతి ఒక్కరి మనసులను ఇట్టే గెలుచుకుంటుంది. భోజనం మొదట్లో అయినా, చివర్లో అయినా ఈ పచ్చడి రుచి చూస్తే ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.

అయితే ఈ పచ్చడి చేయడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ కేవలం 15 నుండి 20 నిమిషాల్లోనే ఇంట్లోనే ఎంతో రుచికరమైన, తాజా నిమ్మకాయ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా నిమ్మకాయను ఎక్కువగా రసం లేదా శీతల పానీయాల కోసమే ఉపయోగిస్తారు. కానీ చాలా ఇళ్లలో ఈ పండుతో ఘుమఘుమలాడే, కారమైన, పుల్లని ఊరగాయ కూడా చేస్తారు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని లేదా పెరుగుతో కలిపి తింటే దీని రుచి అమోఘంగా ఉంటుంది. మరి దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు,విధానం ఇక్కడ చూడండి.

Easy Nimmakaya Pachadi Turn Plain Rice Special With This 20 Minute Homemade Lemon Pickle in Telugu

కావలసిన పదార్థాలు

నిమ్మకాయలు: 4 నుండి 5
ఆవాలు: 2 టేబుల్ స్పూన్లు
మెంతులు: అర టీస్పూన్
పసుపు పొడి: అర టీస్పూన్, చిటికెడు
ఎర్ర కారం పొడి: 3 నుండి 4 టేబుల్ స్పూన్లు
వంట నూనె: అవసరమైనంత
ఉప్పు: రుచికి సరిపడా

చలికాలంలో జలుబు, దగ్గు దరిచేరనివ్వని..ఇమ్యూనిటీని రెట్టింపు చేసే ఉసిరి చ్యవన్‌ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా తాజా నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి, మీకు కావలసిన పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి అవి చిటపటలాడే వరకు వేచి ఉండాలి. అనంతరం మెంతులు, చిటికెడు పసుపు పొడి వేసి సువాసన వచ్చే వరకు కొద్దిసేపు వేయించాలి.

-ఇప్పుడు తరిగి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను బాండీలో వేసి గరిటెతో బాగా కలపాలి. ఆ తర్వాత అర టీస్పూన్ పసుపు పొడి, రుచికి సరిపడా ఉప్పు,కారం పొడి వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలుపుకోవాలి. నిమ్మకాయను పిండినప్పుడు వచ్చే రసాన్ని కూడా ఇందులో కలపడం వల్ల ఊరగాయ రుచి మరింత రెట్టింపు అవుతుంది. దీనిని మీడియం మంట మీద సుమారు 5 నిమిషాల పాటు వండితే చాలు, ఎంతో సువాసనగల, నోరూరించే నిమ్మకాయ ఊరగాయ రెడీ.

-వేడి అన్నం, పెరుగు లేదా చపాతీతో కలిపి తిన్నప్పుడు దీని రుచి మరింత పెరుగుతుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 18, 2026, 8:07 [IST]
Desktop Bottom Promotion