Latest Updates
-
చలికాలంలో వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మిల్లెట్ కూరగాయల సూప్..ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
టీ తాగే వేళలో తినడానికి బెస్ట్ హెల్దీ స్నాక్..తక్కువ సమయంలో,తక్కువ నూనెతో మఖానా టిక్కీ చేసుకోండిలా.. -
మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? -
ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు -
ఓడియమ్మ: బాత్రూమ్ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. -
చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? శరీరంలో జరిగే పరిణామాలు ఇవే! -
క్రిస్పీ సొరకాయ పూరీలు.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
కల్తీ లేని స్వచ్ఛమైన బొంబాయి రవ్వ.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండిలా! -
జిమ్ లేదు, ట్రెడ్ మిల్ లేదు.. ఇంట్లోనే నడిచి 14 కేజీలు తగ్గిన యువతి
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే!
ప్రతిరోజూ ఇంట్లో వండే అదే పప్పు అన్నం, రోటీ కూరగాయలు తిని మీ నాలుక రుచిని కోల్పోయిందా? భోజనమంటేనే బోర్ కొడుతోందా? అయితే అత్యంత సాదాసీదా భోజనాన్ని సైతం అద్భుతమైన విందుగా మార్చే మాయాజాలం ఒకటుంది. అదే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోయల నుండి వచ్చిన పహాడీ హరా నమక్(కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు).
పర్వత ప్రాంతాల ప్రజలు రోలుపై దంచి తయారుచేసే ఈ ఉప్పు ఘాటైన సువాసన, అమోఘమైన రుచి ముందు ఖరీదైన పచ్చళ్లు, చట్నీలు కూడా వెలవెలబోవాల్సిందే. ఇది రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఇందులోని ఇంగువ, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దరిచేరనివ్వవు.

కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు తయారీకి కావలసిన పదార్థాలు
కొత్తిమీర ఆకులు: 1 కప్పు
పచ్చిమిర్చి: 3-4
వెల్లుల్లి రెబ్బలు: 6-8 (పచ్చి వెల్లుల్లి ఆకులు దొరికితే ఇంకా
మంచిది)
అల్లం: 1 అంగుళం ముక్క
వేయించిన జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
రాళ్ల ఉప్పు (కల్లుప్పు) లేదా సాధారణ ఉప్పు: 3-4 టేబుల్ స్పూన్లు
బ్లాక్ సాల్ట్: 1 టీస్పూన్
ఇంగువ: చిటికెడు
కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు తయారీ విధానం
-ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లంలను శుభ్రంగా కడిగి, ఒక పొడి గుడ్డతో తుడవాలి. వీటిలో ఏమాత్రం తడి ఉండకూడదు. ఆకులపై నీరు ఉంటే ఉప్పు త్వరగా పాడైపోతుంది.
-అసలైన రుచి కావాలంటే ఈ పదార్థాలను రుబ్బురోలులో దంచుకోవాలి. రోలు లేకపోతే, మిక్సీ జార్ లో నీళ్లు అస్సలు పోయకుండా పల్స్ మోడ్ లో (కొద్దికొద్దిగా ఆపుతూ, ఆన్ చేస్తూ) బరకగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఈ పచ్చటి మిశ్రమానికి వేయించిన జీలకర్ర, ఇంగువ, నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
-ఇలా కలిపిన తర్వాత, తయారైన ఉప్పును ఒక పళ్ళెంలో పలుచగా పరిచి 10-15 నిమిషాల పాటు గాలికి లేదా లేత ఎండలో ఉంచాలి. దీనివల్ల ఉప్పులోని అదనపు తేమ పూర్తిగా పోతుంది.
ఎలా వాడుకోవాలి? ఎలా నిల్వ చేయాలి?
పూర్తిగా ఆరిన ఈ పచ్చి ఉప్పును గాలి చొరబడని గాజు సీసాలో
భద్రపరుచుకుంటే, నెలల తరబడి ఫ్రెష్ గా ఉంటుంది. సీసా మూత తీయగానే
వచ్చే కమ్మటి సువాసన మీ నోరూరిస్తుంది.
సలాడ్స్, ఫ్రూట్ చాట్, రైతా, ఉడికించిన గుడ్లు, లేదా కాల్చిన బంగాళదుంపలపై ఈ ఉప్పును కాస్త చల్లుకుని తింటే ఆ మజాయే వేరు.
ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు, వేడివేడి పరాఠా లేదా అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఈ పచ్చ ఉప్పు కలుపుకుని తింటే మీరెప్పుడూ మర్చిపోలేని రుచి మీ సొంతమవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
