Latest Updates
-
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.!
రాత్రి అన్నం మిగిలిందా? పారేయకండి.. ఇలా కరకరలాడే కుర్కురేలు చేసుకోండి!
సాయంత్రం వేళ చల్లటి వాతావరణంలో వేడి వేడి టీ తాగుతూ ఇలాంటి కరకరలాడే స్నాక్స్ తినడం చాలామందికి ఇష్టం. అయితే, ప్రతిరోజూ బయట దొరికే ప్యాకెట్ ఫుడ్స్ కొనడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు, పైగా జేబుకు కూడా చిల్లు పడుతుంది. బయట దొరికే ప్యాకెట్ కుర్కురేల రుచితోనే, అవే కరకరలాడే కుర్కురేలను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో మిగిలిపోయే అన్నంతో చేసుకోవచ్చు.

సాధారణంగా మధ్యాహ్నం వండిన అన్నం రాత్రికి లేదా రాత్రి వండిన అన్నం ఉదయానికి మిగిలిపోతుంటుంది. దాన్ని ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ వేడి చేసుకుని తినడానికి చాలామంది ఇష్టపడరు, అలాగని అన్నాన్ని పారేయలేము. అలాంటి మిగిలిపోయిన అన్నంతో నోరూరించే కుర్కురేలను తయారుచేస్తే, పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా సరే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.
మిగిలిపోయిన అన్నంతో కుర్కురేల తయారీకి కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన అన్నం - 2 కప్పులు
ఉడికించిన బంగాళదుంప - 1
బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - 3 టేబుల్ స్పూన్లు
కారం - అర టీస్పూన్
చాట్ మసాలా - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
మిరియాల పొడి -పావు టీస్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
మిగిలిపోయిన అన్నంతో కుర్కురేల తయారీ విధానం
-ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మెత్తగా చేతులతో నలుపుకోవాలి. అవసరమైతే మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు.మరీ మెత్తటి పేస్ట్ లా చేయకూడదు.
-ఇప్పుడు ఈ అన్నం మిశ్రమంలో ముందుగా ఉడికించి, పొట్టు తీసి, మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప గుజ్జును వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేయాలి. ఇవి కుర్కురేలకు పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ ను ఇస్తాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా,కొత్తిమీర వేసి ఈ మిశ్రమాన్ని ముద్దలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
-కొద్దికొద్దిగా ఈ పిండిని తీసుకుంటూ, కుర్కురే ఆకారంలో పొడవుగా, సన్నని పుల్లల్లాగా చేతులతో రోల్ చేసుకోవాలి. మీరు వీటిని ఎంత సన్నగా చేస్తే, వేయించిన తర్వాత అంత కరకరలాడుతూ వస్తాయి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి తయారుచేసుకున్న కుర్కురేలను నెమ్మదిగా నూనెలో వేయాలి.
-ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకుని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. దీంతో అదనపు నూనె పీల్చుకోబడుతుంది. నూనె లేకుండా ఆరోగ్యంగా తినాలనుకునే వారు వీటిని ఎయిర్ ఫ్రైయర్ లో కూడా చేసుకోవచ్చు.
-వీటిని టొమాటో సాస్, మయోన్నైస్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే పిల్లలు ఎగిరి గంతేసి మరీ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
