Latest Updates
-
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే..
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి!
తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఫాస్ట్ లలో పెసరట్టుది ఎప్పుడూ రారాజు స్థానమే. అందులోనూ గుంటూరు స్టైల్ లో చేసే ఎమ్మెల్యే పెసరట్టుకు, ఘాటైన అల్లం పచ్చడిని అద్దుకుని తింటే ఆ మజాయే వేరు. ఉదయం పూట ఎంతో రుచికరంగా, కడుపు నిండిన భావనను ఇచ్చే ఈ బ్రేక్ ఫాస్ట్ ను హోటల్కి వెళ్లే పని లేకుండా, మన వంటగదిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-1 కప్పు పచ్చ పెసలు
-2 టేబుల్ స్పూన్ల బియ్యం
-3 పచ్చిమిర్చి
-చిన్న అల్లం ముక్క
-1 టీస్పూన్ జీలకర్ర
-తగినంత ఉప్పు
-కాల్చడానికి నూనె లేదా నెయ్యి
లోపల స్టఫింగ్ చేసే ఉప్మా కోసం:
-అర కప్పు రవ్వ
-ఒక ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-అల్లం
-కరివేపాకు
-పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర)
-సరిపడా నీరు
-ఉప్పు

తయారీ విధానం
-ముందుగా పచ్చ పెసలను శుభ్రంగా కడిగి సుమారు 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత నీరు వంపేసి, మిక్సీ జార్ లో పెసలు, బియ్యం, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. దోశ పిండి మాదిరిగా వచ్చేలా కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని పులియబెట్టాల్సిన పనిలేదు.
-మరోవైపు స్టవ్ పై బాండీ పెట్టి నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. అవి వేగాక తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉప్మాను చిక్కగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి బాగా వేడయ్యాక, కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయాలి. ఒక గరిటెడు పిండిని తీసుకుని పెనం మధ్యలో పోసి పలుచగా, గుండ్రంగా పరచాలి. అంచుల వెంబడి నూనె వేసి మీడియం మంటపై కాల్చాలి. ఇష్టమైతే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర చల్లుకోవచ్చు. పెసరట్టు అడుగు భాగం ఎర్రగా, కరకరలాడుతూ వేగిన తర్వాత.. మధ్యలో ముందుగా వండిన ఉప్మాను రెండు మూడు చెంచాలు ఉంచి మడవాలి.
-అంతే గుమగుమలాడే ఎమ్మెల్యే పెసరట్టు రెడీ.
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం!
రుచితో పాటే ఆరోగ్యం
చింతపండు, ఎండుమిర్చి, కొద్దిగా బెల్లం వేసి దంచిన అల్లం పచ్చడితో ఈ
పెసరట్టును తింటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. కొబ్బరి చట్నీ కూడా దీనికి
మంచి కాంబినేషన్. పెసల్లో అధికంగా ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల ఇది
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
