Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.!
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడుకునేందుకు రోగ నిరోధక శక్తి చాలా అవసరం. అందుకోసం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇందుకోసం రాగులు, మునగాకు ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్‌తో రోటీ చేసుకుని తిన్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రాగి పిండి మునగాకు రోటీ తయారీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి- ఒక కప్పు
బియ్యం పిండి- అర కప్పు
బొంబాయి రవ్వ- పావు కప్పు
ఉల్లిపాయలు- పావు కప్పు
జీలకర్ర- టీ స్పూన్
మునగాకు- కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
పచ్చి కొబ్బరి ముక్కలు- అర కప్పు
పచ్చిమిర్చి- నాలుగు
వేరు శనగ పప్పులు- పావు కప్పు
రాగి పిండి మునగాకు రోటీ తయారీ విధానం
రాగి పిండి మునగాకు రోటీ తయారీ విధానం కోసం ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలి. తర్వాత మునగాకు ఆకులను కడిగి పెట్టుకోవాలి. వేరు శనగ పల్లీలను వేయించి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో రాగి పిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, మునగాకు ఆకులు, కొబ్బరి- పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసి కలుపుకోవాలి.

తర్వాత ఈ పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోసి పిండి ముద్దలా కలుపుకోవాలి. పావు గంట పాటు గిన్నెపై మూత పెట్టుకోవాలి.
ఇప్పుడు సిల్వర్ కవర్ లాంటి పేపర్ ఒకటి తీసుకుని దానిపై పలచగా నూనె రాసుకోవాలి. కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని కవర్‌పై చపాతీ మాదిరిగా గుండ్రంగా చేతితో ఒత్తుకోవాలి.
స్టవ్‌పైన పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె రాసి ఈ రోటీలను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకోవాలి.
అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన రాగి పిండి మునగాకు రోటీ రెడీ. వీటిని చిన్నపిల్లలు సైతం ఈజీగా తినేస్తారు.
సాయంత్రం సమయంలో స్నాక్స్‌గా లేదా, వారాంతాల్లో బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా వీటిని చేసుకుని ఇంటిల్లిపాదీ తినవచ్చు. సీజన్ ఏదైనా రాగులు, మునగాకులోని పోషకాలు ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తాయి. వీటిని టమాటా పచ్చడి లేదా ఏదైనా నాన్‌వెజ్ కర్రీలోకి అయినా చేసుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుంది.
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా..
రాగి పిండి, మునగాకు పోషకాల గనిగా మన రోజువారీ ఆహారంలో భాగమయ్యాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం ద్వారా ఎముకల దృఢత్వంగా ఉంటాయి. పిల్లలు, వృద్ధులకు ఇది బలవర్ధకమైన ఆహారంగా ఇవ్వడం ద్వారా బలంగా ఉంటారు. రక్తహీనత సమస్యను నివారిస్తుంది. వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
రాగుల్లోని కాల్షియంతో పాటు, మునగాకులో ఐరన్ పోషకాల ద్వారా హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యను నివారిస్తుంది. రాగులు, మునగాకులు ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కంటి సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఆహారంగా మేలు చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
