Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
దోశ, చపాతీలోకి అదిరిపోయే స్పైసీ పచ్చళ్లు.. ఇలా చేశారంటే ఆ టేస్టే వేరు.!
తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్లు చాలా స్పెషల్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో రోటి పచ్చళ్లు ఆల్టైం ఫేవరెట్. అయితే దోశల్లోకి ఎక్కువగా పల్లీ, కొబ్బరి చట్నీ.. చపాతీల్లోకి ఆలూ ఫ్రై, పప్పు, కుర్మా ఇలా చేస్తుంటారు. కానీ ఈ సారి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీరకాయ తొక్కతో ఇలా సింపుల్గా పచ్చడి చేసి చూడండి. ఇకపై రెగ్యులర్ చట్నీలు చేయడం ఆపేస్తారు.

ఉల్లిపాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి - నాలుగు
వెల్లుల్లి- నాలుగు రెబ్బలు
కొత్తిమీర- కొద్దిగా
ఉప్పు- సరిపడా
కారం- టీ స్పూన్
ఆవాలు, జీలకర్ర- టీ స్పూన్
నూనె- ఒక స్పూన్
కరివేపాకు
పసుపు
తయారీ విధానం
-ముందుగా ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు రోట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కారం,
కొత్తిమీర, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నూనె వేడి చేసి
అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుని తాలింపు
పెట్టుకోవాలి. అంతే స్పైసీ ఉల్లిపాయ పచ్చడి రెడీ..
బీరకాయ తొక్క పచ్చడికి కావాల్సిన పదార్థాలు
బీరకాయలు- ఒకటి పెద్దది
పచ్చి కొబ్బరి తురుము- కప్పు
చింతపండు- చిన్న నిమ్మకాయ సైజు
మినప్పప్పు- టీస్పూన్
కందిపప్పు- టీస్పూన్
ఎండుమిర్చి- మూడు
వెల్లుల్లి- నాలుగు రెబ్బలు
నూనె- టేబుల్ స్పూన్
తయారీ విధానం
-ముందుగా బీరకాయ తొక్క తీసి పెట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక బీరకాయ తొక్క తీసి వేగాక పక్కన పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్లో మిగిలిన నూనె వేసి మినప్పప్పు, కందిపప్పు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, చింతపండు వేసి మగ్గనివ్వాలి. చివరిగా మరోసారి బీరకాయ తొక్క వేసి కలిపి కాసేపు వేయించాక మిక్సీలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి తాలింపు అవసరం లేదు. అంతే స్పైసీ బీరకాయ తొక్క పచ్చడి రెడీ.. ఈ పచ్చళ్లు టిఫిన్లోకే కాదు వేడి వేడి అన్నంలోకి కూడా అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
