Latest Updates
-
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా?
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.!
నాన్ వెజ్ ఇష్టపడని వారికి వెజ్
వంటకాల్లో సోయా చాలా స్పెషల్. సోయాతో కూరలు, వేపుళ్లు,
స్నాక్స్ ఇలా చాలా చేసుకుంటారు. ఇక సోయా మసాలా కూడా
ఫేమస్. అయితే ఈ సారి ఈ స్టైల్‌లో సోయా టిక్కా
మసాలా చేసి చూడండి. మటన్ రుచిని తలపించేలా ఈ
స్పెషల్ డిష్ ఇంటిల్లిపాదికి ఫేవరెట్
అవుతుంది.

సోయా టిక్కా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
మారినేషన్ కోసం
సోయా- 100 గ్రాములు
పెరుగు- ఒక టీస్పూన్
కారం పొడి- ఒక టీ స్పూన్
పసుపు- కొద్దిగా
ఉప్పు- తగినంత
టిక్కా మసాలా- టీ స్పూన్
కసూరి మేతి- కొద్దిగా
నిమ్మ రసం- టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీ స్పూన్
క్యాప్సికమ్- ఒకటి(పొడవైన ముక్కలుగా కట్
చేసుకోవాలి)
ఉల్లిపాయ- ఒకటి(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నూనె- టేబుల్ స్పూన్
-మారినేషన్ కోసం ముందుగా సోయాను కొన్ని కప్పు వేడినీళ్లలో ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని పిండి మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పైన చెప్పినవన్నీ(ఉల్లిపాయ, క్యాప్సికమ్, నూనె మినహా) కలుపుకోవాలి. ఓ ఐదునిమిషాలపాటు నానబెట్టిన తర్వాత పాన్‌లో నూనె వేసి వేడయ్యాక సోయా స్టఫ్‌ను పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్ వేసి కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి.
సోయా టిక్కా మసాలా గ్రేవీ కోసం కావాల్సిన
పదార్థాలు
నూనె- టేబుల్ స్పూన్
జీలకర్ర- టీ స్పూన్
ఉల్లిపాయ- ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీ స్పూన్
టొమాటో- ఒకటి
కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్- టీ
స్పూన్
పసుపు- కొద్దిగా
గరం మసాలా- టీస్పూన్
ఉప్పు- తగినంత
కసూరి మేతి- కొద్దిగా
ధనియాల పొడి- టీ స్పూన్
తయారీ విధానం
గ్రేవీ కోసం పాన్‌లో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత టొమాటో, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కారం, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, కసూరి మేతి వరుసగా అన్నీ కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత వేయించుకున్న సోయా స్టఫ్‌ను వేసి కాసేపు ఉడికిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. నూనె పైకి తేలేవరకు ఉడికించుకోవాలి. అవసరమైతే చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే టేస్టీ సోయా టిక్కా మసాలా రెడీ.. చపాతీలోకి, వేడి అన్నంలోకి రుచి అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
