Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే మటన్ ఊరగాయ.. ముక్క తగిలితే మజానే!
మాంసాహారులకు మటన్ అంటే ఎంత ఇష్టమో, భోజన ప్రియులకు ఊరగాయ పచ్చళ్లు అంటే కూడా అంతే ఇష్టం. మరి ఈ రెండింటి కాంబినేషన్లో అదిరిపోయే రెసిపీ ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచిస్తుంటేనే నోటివెంట నీళ్లు ఊరుతున్నాయి కదూ. అదే మటన్ ఊరగాయ. ఘాటుగా, పుల్లగా, నోటికి భలే రుచిగా తగిలే ఈ మటన్ పచ్చడిని చూస్తే ఎవరికైనా ఆకలి రెట్టింపు అవ్వాల్సిందే. ఎంతో అద్భుతంగా ఉండే ఈ రెసిపీని ఇంట్లోనే చాలా సులభంగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మటన్ ఊరగాయ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బోన్ లెస్ మటన్
-గరం మసాలా పొడి
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-ఉప్పు
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-జీలకర్ర
-మెంతులు
-ఆవాలు
-నూనె
-వెల్లుల్లి
-కరివేపాకు
-పచ్చిమిర్చి
-నిమ్మరసం
-మటన్ మసాలా
మటన్ ఊరగాయ తయారీ విధానం
-ముందుగా ఒక పావు కిలో బోన్ లెస్ మటన్ (లేదా మీకు నచ్చిన మాంసం) తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో లేదా కుక్కర్ లో ఈ మాంసం ముక్కలను వేసి, అందులో 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అర టీస్పూన్ మటన్ మసాలా, 1 టీస్పూన్ ధనియాల పొడి వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి.
-మసాలాలన్నీ ముక్కలకు పట్టిన తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు పోసి సుమారు 15 నిమిషాల పాటు మాంసం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మాంసం ఉడికిన తర్వాత అందులో ఇంకా ఏమైనా అదనపు నీరు మిగిలి ఉంటే, మంటను కాస్త పెంచి నీరంతా పూర్తిగా ఇగిరిపోయి, ముక్కలు డ్రైగా మారేలా సుఖించుకోవాలి. ఇక్కడే పచ్చడికి మంచి బేస్ తయారవుతుంది.
-ఏ పచ్చడికైనా అసలైన రుచి, ఘుమఘుమలాడే సువాసన ఇచ్చేది అందులో వాడే మసాలానే. దీనికోసం ఒక చిన్న పాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అర టీస్పూన్ మెంతులు, 1 టీస్పూన్ ఆవాలు వేసి సన్నపు మంటపై దోరగా వేయించాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. వేయించిన ఈ దినుసులను కాసేపు చల్లారనిచ్చి, ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి అందులో అర కప్పు నూనె పోసి వేడి చేయాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నూనె కాస్త ఎక్కువే పడుతుంది.
-నూనె వేడెక్కగానే పావు టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత అందులో 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు కరివేపాకు, అలాగే ఘాటైన 4 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేయాలి. ఇవన్నీ నూనెలో చక్కగా వేగుతుండగానే..ముందుగా ఉడికించి పెట్టుకున్న మాంసం ముక్కలను ఇందులో వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఆ వెంటనే మనం దంచి పెట్టుకున్న స్పెషల్ మసాలా పొడిని కూడా వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా ఓ రెండు నిమిషాలు కలపాలి.
-చివరిగా, స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల తాజా నిమ్మరసం పిండుకుని గరిటతో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఎంతో స్పైసీగా, ట్యాంగీగా ఉంటూ నోరూరించే మటన్ ఊరగాయ రెడీ.
-ఈ పచ్చడిని ఒక గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకుంటే కొద్ది రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంతో పాటు, గరికల్లాంటి పరాఠా లేదా మెత్తటి రోటీతో ఈ పచ్చడిని కలుపుకుని తింటే ఆ మజా వర్ణించలేం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
